జగిత్యాలకు ఏం చేశారు: కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Mar 24, 2019, 2:47 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫైరయ్యారు. ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ కర్మాగారాన్ని ఏకంగా మూసివేయించారని ఆరోపించారు. రూ.800 కోట్లు వ్యవసాయం కింద బడ్జెట్‌లో పెట్టి.. రూ.8 వేలు కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పసుపు పంటకు మద్ధతు ధర కూడా ఇవ్వలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పసుపుకు క్వింటాల్‌కు రూ.1500 ఇచ్చారు.

లక్ష్మీపూర్‌లో సీడ్ పార్క్‌కు హడావిడిగా శంకుస్ధాపన చేశారని ఎద్దేవా చేశారు. రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునికీకరణలో భాగంగా 0.25 టీఎంసీల సామర్ధ్యమున్న ప్రాజెక్ట్‌ను 1 టీఎంసీకి పెంచుతామన్నారు కానీ ఉన్న 0.25 టీఎంసీలే నిండటం లేదు. ముందు నీళ్ల గురించి చూడాలని జీవన్ రెడ్డి సూచించారు.

click me!