గులాబీ జెండా పీకేసి నీలి జెండా ఎగరేద్దాం...: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

By Arun Kumar PFirst Published Aug 1, 2021, 1:10 PM IST
Highlights

కేసీఆర్ సర్కార్ బడగు బలహీన వర్గాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 

హైదరాబాద్: ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను పావుగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ పథకం కోసం ఖర్చుచేసే నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.  

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ ముుఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం ఇచ్చే తాయిలాల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. దళిత బిడ్డల బ్రతుకులు బాగుపడాలంటే గులాబీ జెండా పోయి నీలి జెండా ఎగరాలన్నారు. బహుజన రాజ్య స్థాపనకోసం ఐక్యంగా పోరాడాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. 

read more  పథకాలు ప్రచారానికి పరిమితం... కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (వీడియో)

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణకు కామారెడ్డిలో స్థలాన్ని కేటాయించారు...కానీ క్రీడాకారిణి పివి సింధుకు మాత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్థలం కేటాయించారు... ఇదే బలహీన వర్గాల పట్ల కేసీఆర్ సర్కార్ కు వున్న వివక్షకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ అన్నారు.  

బలహీన వర్గాలను కావాలనే చదువుకు దూరం చేస్తున్నారని... వారి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. ఇందులో భాగంగానే విద్యాసంస్థల్లో నియామకాలు చేపట్టడం లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బలహీన వర్గాల ప్రజలు వీటన్నింటిని గమనిస్తూ వుండాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. 
 

click me!