సీనియర్ ఐఎఎస్, ఐఎఫ్ఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్: ఆరు నెలల జైలు, జరిమానా

Published : Aug 01, 2021, 12:00 PM IST
సీనియర్ ఐఎఎస్, ఐఎఫ్ఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్: ఆరు నెలల జైలు, జరిమానా

సారాంశం

కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకుగాను సీనియర్ ఐఎఎస్ అధికారి శాంతికుమారి, ఐఎఫ్ఎస్ అధికారులకు  ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ రూ. 2 వేల జరిమానాను విధించింది తెలంగాణ హైకోర్టు.


హైదరాబాద్:కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి, ఐఎఫ్ఎస్ అధికారులకు  తెలంగాణ హైకోర్టు  ఆరు మాసాల జైలు శిక్షతో పాటు రూ 2 వేల జరిమానాను విధించింది.రంగారెడ్డి జిల్లాలో ఓ భూ వివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకు గాను ఉన్నత న్యాయస్థానం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఫారెస్ట్ డిఫార్ట్ మెంట్  స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ. శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఐఎఫ్ఎస్ అధికారులు శోభ, సునీతా భగవత్, జానకీరామ్, తిరుపతిరావులకు ఆరు మాసా జైలుశిక్షతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మహ్మద్ సిరాజుద్దీన్ సహా మరో 9 మందికి చెందిన 383 ఎకరాల భూమి విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకుగాను హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.హైకోర్టు జడ్జి అమర్‌నాథ్ గౌడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అధికారులకు జైలు శిక్ష. జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకొంది.

PREV
click me!

Recommended Stories

ఖమ్మం భహిరంగ సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ | CM Revanth Reddy Grand Mass Entry
హైద‌రాబాద్‌లో క‌చ్చితంగా ఇల్లు కొనాల‌ని రూలు ఏం లేదు బ్రో.. ప్లాన్ బీ ఆప్ష‌న్ కూడా ఉంది