'బీఆర్ఎస్సే కాంగ్రెస్.. కాంగ్రెస్సే బీఆర్ఎస్’.. మరోసారి నోరు జారిన రాజయ్య, షాక్‌లో గులాబీ దండు

By Siva KodatiFirst Published Apr 4, 2023, 8:55 PM IST
Highlights

లైంగిక వేధింపుల కేసులు, వరుస వివాదాలతో బీఆర్ఎస్ పరువు తీస్తోన్న మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు.
 

మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్‌దే విజయమన్నారు. బీఆర్ఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. ఈసారి కూడా నిండు మనసుతో బీఆర్ఎస్‌ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజయ్య వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న పార్టీ నేతలు , కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. అసలేం జరుగుతోందో వారికి అర్ధం కానీ పరిస్ధితి. ప్రస్తుతం రాజయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుండగా.. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల గురించి మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆత్మీయ సమ్మేళనాల గురించి తనకు  సమాచారం లేదని  ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి   చెప్పారు. ఈ వ్యాఖ్యలపై  ఆదివారంనాడు  రాజయ్య స్పందించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు  సంబంధించి నల్గొండకు  కడియం శ్రీహరి  ఇంచార్జీగా ఉన్నందునే  ఆత్మీయ సమ్మేళనాలకు ఆయనకు ఆహ్వనం పంపలేదన్నారు. పార్టీ అధిష్టానం  సూచనలను తాను పాటిస్తానని.. ఈ నెల  4వ తేదీన  స్టేషన్ ఘన్ పూర్ క్లస్టర్  1లో ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించనున్నట్టుగా  రాజయ్య చెప్పారు. 

ALso Read: సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారు.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య..

ఇకపోతే.. రాజయ్య ఇటీవల కన్నీటిపర్యంతమయ్యారు. ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకలకు హాజరైన ఆయన.. కేక్ ముందు కూర్చుని గుక్కపట్టి ఏడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన మీద లైంగిక ఆరోపణలు చేస్తున్నారని కంట కన్నీరు పెట్టుకున్నారు. సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారు. నా కూతురు వయసున్న మహిళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు గెలిచాను. ఇక ముందు గెలవబోతున్నాను. 

ఘనపురం నియోజకవర్గంలో నాలుగుసార్లు గెలిచాను. ఏసుప్రభు మార్గంలో ఐదోసారి కూడా గెలిచి తీరతానని తెలిపారు. ఆయన గుక్కపట్టిఏడుస్తుంటూ.. చుట్టూ ఉన్నవారు ఆయనను ఓదార్చారు. తాడికొండ రాజయ్య గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  

click me!