రైతు భరోసా, పెన్షన్ లపై అపోహలొద్దు.. కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి

By Sairam Indur  |  First Published Dec 30, 2023, 1:53 PM IST

Praja Palana : ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయి పరిస్థితులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజలెవరికీ ఇబ్బందులు కలగకూడదని అన్నారు. రైతు బంధు, పెన్షన్ విషయంలో లబ్దిదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 
 


abhaya hastham Praja Palana : రైతు భరోసా, పెన్షన్ లపై అపోహలకు గురి కావొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సీఎస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

22 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం.. తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఏం చెప్పారంటే ?

Latest Videos

undefined

రైతు బంధు, పెన్షన్ లపై ఎవరూ అపొహలకు గురి కావొద్దని ఆయన అన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత వరకు లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలని అనుకునేవారు ఈ ప్రజా పాలన ఫారమ్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలెవరూ గందరగోళానికి గురి కాకూడదని కోరారు. 

శ్రీమంతురాలు కావాలని నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. తరువాత ఏం జరిగిందంటే ?

ప్రజా పాలనపై సమీక్ష సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల్లొ కొరత ఉండొద్దని తెలిపారు. దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తు ఫారమ్ లను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 

తిరుమల మరో సారి చిరుత అలజడి.. అలిపిరి మెట్ల మార్గంలో కదలికలు

ఈ ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలన క్యాంపుల్లో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 

click me!