క్రికెట్ ఆడుతూ, ఛాతినొప్పితో సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాసం హఠాన్మరణం.. కేటీఆర్ సంతాపం..

By SumaBala Bukka  |  First Published Jun 6, 2022, 9:53 AM IST

పరకాలలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ సీనియర్ పాత్రికేయుడు మెండు శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 


పరకాల : క్రికెట్ ఆడుతుండగా ఛాతీనొప్పి, ఆయాసంతో బాధ పడిన ఓ సీనియర్ పాత్రికేయుడు కొద్దిసేపటికే కన్నుమూశారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఈ విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్నేహితులు క్రికెట్ పోటీ పెట్టుకున్నారు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ కు దిగిన మెండు శ్రీనివాస్ (50)కు ఛాతినొప్పి, ఆయాసం రావడంతో రిటైర్డ్ హార్ట్ గావెనక్కు తిరిగారు. అక్కడి నుంచి ఓ మిత్రుడు ఇంటికి వెళ్లగా మరోసారి ఆయాసంతో అవస్థ పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా… గుండెపోటుగా అనుమానించిన వైద్యులు పరీక్షలు చేస్తున్న క్రమంలోనే మృతిచెందారు.

 మెండు శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. గతంలో ఈనాడు విలేఖరి గా కూడా పని చేశారు. ఉమ్మడి కరీంనగర్ మాజీ వార్త బ్యూరో ఇంచార్జిగా కూడా పనిచేశారు.  ఆయనకు, భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి చెందిన నలుగురు మిత్రులు అందరూ సంతాపం తెలిపారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే శ్రీనివాస్ కన్నుమూశారు.

Latest Videos

undefined

ఆయన పరకాల క్రికెట్ టీమ్  పీసీసీ క్రికెట్ క్లబ్ ఫ్రెండ్లి మ్యాచ్ కోసం పరకాల కు వచ్చారు. ఓపినర్ గా బ్యాటింగ్ దిగి 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. అలసిపోవడం తో బై రన్నర్ కోసం అడిగితే సహచర క్రీడాకారులు అలసిపోయిన తీరును గమనించి వద్దులే అని వారించడంతో బయటకు వెళ్ళాడు. అప్పటికే అన్ ఈజీగా ఉండడంతో ఇంటికి వెల్తా అని వెళ్ళాడు. కొద్దిసేపటి తేడా అనిపించి హాస్పిటల్ కి వెళ్లే వరకూ పరిస్థితి విషమించింది.

సీనియర్ పాత్రికేయుడి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 21ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ వార్తలు ప్రజలకు చేరవేస్తున్న మెండు శ్రీనివాస్ హఠన్మరణం పట్ల  మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపాన్ని తెలిపారు. సుదీర్ఘకాలంపాటు తెలంగాణ రాష్ట్ర సమితి వార్తలను కవర్ చేస్తున్న శ్రీనివాస్ తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా కేటిఆర్ గుర్తుచేసుకున్నారు. తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

click me!