అంతా ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని జమున హేచరీస్ సంస్థ న్యాయవాది తెలంగాణ హైకోర్టకు వివరించారు.
హైదరాబాద్: అంతా ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని జమున హేచరీస్ సంస్థ న్యాయవాది తెలంగాణ హైకోర్టకు వివరించారు.జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. మాసాయిపేట, హాకీంపేట పరిసర గ్రామాల్లో అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ సంస్థ ఆక్రమించుకొందని మెదక్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు.
also read:దేవరయంజాల్ భూముల ఇష్యూ: రెండో రోజూ ఐఎఎస్ కమిటీ విచారణ
undefined
ఈ నివేదిక తప్పుల తడక అంటూ జమున హేచరీస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 24 గంటల్లోనే విచారణ చేసి కలెక్టర్ నివేదిక ఇచ్చిన విషయాన్ని జమున హేచరీస్ సంస్థ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అయితే పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.
జమున హేచరీస్ సంస్థ ఆక్రమించిందని చెబుతున్న భూములన్నీ కూడ పట్టా భూములేనని ఈ విషయమై ధరణి పోర్టల్‌లో కూడ జమున ఈటల రాజేందర్ తరపు న్యాయవాది వాదించారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు కాపీని తీసుకొన్న తర్వాత 24 గంటల్లోనే విచారణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హడావుడిగా విచారణ పూర్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం తమకు నోటీసులు కూడ ఇవ్వని విషయాన్ని జమున హేచరీస్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కలెక్టర్ ఇచ్చిన నివేదికలో తప్పులను కూడ ఈటల తరపు న్యాయవాది ఈ సందర్భంగా గుర్తుచేశారు. జమున భర్త రాజేందర్ కాకుండా కొడుకు నితిన్ ను భర్త స్థానంలో పేరు చేర్చారని హైకోర్టు తీసుకొచ్చారు. స్థానిక గ్రామపంచాయితీ అనుమతి తీసుకొని గోడౌన్లు నిర్మించినట్టుగా ఈటల న్యాయవాది కోర్టుకు చెప్పారు.