Amit Shah: ఈటల రాజేందర్ ముందు గడ్డుకాలం.. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో..!

By Mahesh K  |  First Published Dec 28, 2023, 6:37 PM IST

అమిత్ షా తెలంగాణ పర్యటనలో రాష్ట్ర బీజేపీ నేతలపై సీరియస్ అయ్యారు. నేతల మధ్య విభేదాలపై ఆగ్రహించారు. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి వెళ్లాలని, సిట్టింగ్ ఎంపీలకు అవే స్థానాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధిష్టానం అపారమైన నమ్మకం పెట్టుకున్న ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓడిపోయారు. ఇప్పుడు ఆయన భవితవ్యం బీజేపీ హైకమాండ్ చేతిలో ఉన్నదని చెబుతున్నారు.
 


Etela Rajender: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ రోజు తెలంగాణకు వచ్చారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 30 సీట్లు గెలుస్తుందని అనుకున్నామని, కానీ, ఫలితాలు అలా రాలేవని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, ఓటు పర్సెంటేజీ పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా పార్లమెంటు ఎన్నికల గురించీ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, బీజేపీకి అత్యధిక సీట్లు తెచ్చిపెట్టాలని సూచించారు. అభ్యర్థులను వీలైనంత తొందరగా ప్రకటిస్తామని, నలుగురు సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానాల నుంచి పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నామని అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ పైనా అమిత్ షా సీరియస్ అయినట్టు సమాచారం.

ఈటల రాజేందర్ కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని, కాంగ్రెస్ టికెట్ పై పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. బండి సంజయ్ పైనే కాంగ్రెస్ టికెట్ పై తలపడతారనీ వార్తలు వచ్చాయి. ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలోనే ఉంటానని, పార్టీ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.

Latest Videos

undefined

Also Read: New Year: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ. 15 వేల ఫైన్, క్యాబ్స్ రైడ్ నిరాకరించినా జరిమానా

ఈటల రాజేందర్‌పై పార్టీ నాయకత్వం అపారమైన నమ్మకం పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ చెప్పినట్టుగా నడుచుకుంది. ఆయన చెప్పినవారికి టికెట్లు ఇచ్చింది. మత రాజకీయాలు కాకుండా.. కుల రాజకీయానికి తెరలేపింది. బీసీ సీఎం ప్రకటన చేసింది. ఇవన్నీ ఈటల రాజేందర్ సూచనల మేరకే అధిష్టానం చేసినట్టు సమాచారం. కానీ, ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించలేదు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొని గెలిచిన ఈటల రాజేందర్.. తాజాగా హుజురాబాద్‌లోనే కాదు.. రెండో స్థానంగా పోటీ చేసిన గజ్వేల్‌లోనూ పరాజయం పాలయ్యారు. ఇది ఈటల రాజేందర్ పొలిటికల్ కెరీర్‌కు పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మారడమే కాదు.. బీజేపీ అధిష్టానం ఆయనపె పెట్టుకున్న నమ్మకాలనూ సడలించింది.

అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం బండి సంజయ్ కంటే కూడా ఈటల రాజేందర్‌కే పార్టీ అదిష్టానం ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. నిజానికి ఇప్పుడు బండి సంజయ్‌కు ఎంపీ సీటుపై లైన్ క్లియర్ అయింది. కానీ, ఈటల రాజేందర్ పరిస్థితి మాత్రం అనిశ్చితిలో ఉన్నది. ఈసారి ఆయన ప్రజాప్రతినిధిగా లేరు. ఒక వేళ ఎంపీగానూ  ఓడిపోతే ఆయన రాజకీయ భవిత ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Congress: ప్రతిపక్ష కూటమికి అయోధ్య సవాల్.. రామ మందిర కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా?

తెలంగాణ ఉద్యమ నేతగా ఈటల రాజేందర్‌కు పేరు ఉన్నది. కానీ, ఎంపీ సీటు ఎక్కడిచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పలేం. కరీంనగర్ నుంచి పోటీ చేస్తే పరిస్థితులు ఆయనకు సానుకూలంగా ఉండేవి. కానీ, బండికి లైన్ క్లియర్ కావడంతో ఈటల రాజేందర్ మరేచోట నుంచి లోక్ సభకు పోటీ చేసినా.. సవాల్ అనే చెప్పవచ్చు. కాబట్టి, ఈటల రాజేందర్ భవిష్యత్‌కు సంబంధించిన కీలక నిర్ణయం ఇప్పుడ బీజేపీ అధిష్టానం చేతిలో ఉన్నది.

click me!