ఉద్ధవ్‌తో కేసీఆర్ భేటీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Feb 20, 2022, 4:23 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర సీఎం Uddhav Thackerayతో తెలంగాణ సీఎం KCR భేటీపై  ఆదివారం నాడు ఈటల రాజేందర్ స్పందించారు. Medramలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను తెలంగాణ మంత్రులు అవమానపర్చారని ఆయన మండిపడ్డారు. గవర్నర్ వచ్చిన సమయంలో కనీసం మంత్రులు ప్రోటోకాల్ కూడా పాటించలేదన్నారు. ఈ తరహా సంప్రదాయం సరైంది కాదని ఆయన చెప్పార. తెలంగాణలో సంస్కారహీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన రోజున ప్రధానమంత్రి Narendra Modi  ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని Etela Rajender  గుర్తు చేశారు.

Latest Videos

 వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమని రాజేందర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని ఇస్తాయనే విషయాన్ని KTR గుర్తుంచుకోవాలన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నా కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ తరహా చిల్లర రాజకీయాలను మానుకోవాలని రాజేందర్ కేటీఆర్ కు సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను బర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూపులు చూస్తోందన్నారు.


సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్లో మితిమీరుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటం లో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ముఖ్యమం త్రి కేసీఆర్‌.. ఠాక్రే, పవార్‌తో చర్చించనున్నారు.ఎన్డీఏయేతర పార్టీలతో కేసీఆర్ జట్టు కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.. ఇద్దరు సీఎంల భేటీ ముగిసిన తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుండి సంప్రదింపులు సాగిస్తున్నారు.అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు

దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై పవార్‌తోనూ కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.

రెండు వారాల క్రితమే కేసీఆర్ తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఫోన్ లో మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు.అటు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు HD Devegowda కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ‌ అభినందించారు.  

click me!