మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Feb 20, 2022, 3:17 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ డోర్లు తెరిస్తే మాజీ మంత్రి, పెద్దపల్లి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీఆర్ఎస్ లో చేరుతారని పెద్దపల్లి జడ్పీ చైర్మెన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెద్దపల్లి:తెలంగాణ సీఎం కేసీఆర్‌ TRS పార్టీ తలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల D.Sridhar Babu గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ Putta Madhu సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగడం లేదని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా KCR గేట్లు తెరవడం లేదని పుట్ట మధు వివరించారు.కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. 

పెద్దపల్లి జిల్లాలో అడ్వకేట్ దంపతుల హత్య తర్వాత పుట్ట మధు కొంత కాలం పాటు అదృశ్యమయ్యారు. ఈ కేసుతో తనకు ప్రమేయం లేదని కూడా ఆయన ప్రకటించారు. మరో వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ BJPలో చేరే సమయంలో కూడా పుట్ట మధు కూడా ఆటల రాజేందర్ వెంటే బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని పుట్ట మధు ఖండించారు. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.  చాలాా కాలం వరకు పుట్ట మధు సంచలన వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. కానీ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనానికి తెర తీశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత Congress శాసనసభపక్షం టీఆర్ఎస్ లో విలీనం అయింది.  ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం MIM ప్రధాన విపక్షంగా కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్ున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే  ఆ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరుతారా లేదా బీజేపీలో చేరుతారా అనే విషయమై తేలాల్సి ఉంది. అయితే కొంత కాలంగా కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ మారుతామని కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేవార. కానీ ప్రస్తుతం స్ధబ్దుగా ఉంటున్నారు.

అయితే మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా.. తెర వెనుక ఏమైనా మంత్రాంగం జరుగుతుందా అనే చర్చ కూడా లేకపోలేదు. అయితే ఈ విషయమై శ్రీధర్ బాబు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
 

click me!