Telangana: ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Published : Feb 20, 2022, 04:07 PM IST
Telangana: ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్:  మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సారాంశం

Telangana: ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌ని రాష్ట్ర ఇంధ‌న శాఖ మంత్రి  జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు.

Telangana: తెలంగాణ రాష్ట్రం ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ని రాష్ట్ర ఇంధ‌న శాఖ మంత్రి ( Energy Minister) జ‌గ‌దీశ్ రెడ్డి (G Jagadish Reddy) అన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కొన‌సాగుతున్న స‌మ‌యంలోనూ ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఆశా వ‌ర్క‌ర్లు కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని కొనియాడారు. తెలంగాణ ఆరోగ్య నిర్మాణంలో వీరి (ASHA workers) పాత్ర  కీల‌కంగా ఉన్న‌ద‌ని తెలిపారు. 

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సూర్యాపేటలోని త‌న‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల (ASHA workers) కు స్మార్ట్‌ ఫోన్లను మంత్రి  (G Jagadish Reddy) పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఆరోగ్య రంగ నిర్మాణంలో ఆశా కార్య‌క‌ర్త‌లు కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని వారి సేవ‌ల‌ను కొనియాడారు.  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులుగా, మహమ్మారి సమయంలో ఆశా కార్యకర్తలు (ASHA workers) అందించిన సేవలు వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయ‌ని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 9,750కి పెంచింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధ‌మైన వేత‌నాలు అందించ‌డం లేద‌ని  మంతి  (G Jagadish Reddy) తెలిపారు. 

ఇతర రాష్ట్రాల్లోని ఆశా వర్కర్ల (ASHA workers) కు కేవలం రూ.3వేలు చెల్లిస్తున్నారని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిరూపించారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆశా వర్కర్లదే ప్రధాన పాత్ర అని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్య వివరాలను అప్‌లోడ్ చేయడానికి వీలుగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్‌లను  అందించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో 1,070 మంది ఆశా వర్కర్ల (ASHA workers) కు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రజారోగ్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రధాని మోదీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందని ఎత్తి చూపారు. కాగా, ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కోటాచలం తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుండ‌గా, రాష్ట్ర మంత్రులు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, శంకుస్థాప‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఉప్పల్ భగాయత్‌లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), గంగుల కమలాకర్ (gangula kamalakar) , శ్రీనివాస్ గౌడ్ (srinivas goud), MLA సుభాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. బీసీల‌ అభివృద్ధి కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. బీసీలు ఆత్మ గౌర‌వంతో  బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచ‌ల‌న అని పేర్కొన్న మంత్రి.. గ‌త పాల‌కులు బీసీలను ఓటు బ్యాంకు గానే భావించారని విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. బీసీలు క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని  మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu
Dr Sravan Dasoju: వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి | Asianet News Telugu