మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది.
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో బీజేపీ నేతలు గురువారంనాడు ఖమ్మంలో భేటీ అయ్యారు. బీజేపీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తున్నారు. పార్టీలో చేరాలని ఈ ఇద్దరు నేతలను బీజేపీ బృందం ఆహ్వానించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులపై ఈ ఏడాది ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను తమ పార్టీల్లో చేరాలని కాంగ్రెస్, బీజేపీలు ఆహ్వానాలు పంపుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ 9న కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న మరుసటి రోజే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది.
జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేరాలని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఆహ్వానించారు. మాజీ మంత్రి , డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు జూపల్లి కృష్ణారావుకు పోన్ చేసి బీజేపీలో చేరాలని కోరారు. అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
also read:పొంగులేటితో నేడు లంచ్ భేటీ: బీజేపీలోకి ఆహ్వానించనున్న ఈటల
మరో వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ టీమ్ గత మాసంలో సమావేశమైంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ టీమ్ కు చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బీజేపీ నేతలు ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారని సమాచారం.