కాన్వాయ్ వదిలేసి ఈద్గాకు బైక్ మీద ఈటల (వీడియో)

First Published Jun 26, 2017, 11:12 AM IST
Highlights

మంత్రివర్యులు అనగానే ముందు పోలీసు సైరన్ కార్లు, వెనుక మందీ మార్బలంతో డజను లేదా అర డజను కార్ల మంద. ఆ మంత్రి ఏ ప్రోగ్రాం పోవాలన్నా ఈ హడావిడి అంతా ఊంటుంది. అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత మంత్రి వచ్చి కార్యక్రమంలో పాల్గొని నిమిషాల వ్యవధిలోనే తుర్రుమని వెళ్లిపోతుంటారు. కానీ తెలంగాణ మంత్రి ఒకరు పతిత్ర  రంజాన్ మాసంలో పాల్గొనేందుకు ఎంత శ్రమించారో చూడండి.

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పవిత్ర రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కాన్వాయ్ పక్కన పడేసి బైక్ మీద వెళ్లారు. కొండలు గుట్టలు ఎక్కి మరీ ఆ పవిత్ర కార్యంలో పాలుపంచుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని చల్లుర్ లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.  

అన్నిచోట్ల ఉన్నట్లు కాకుండా చల్లుర్ లో ఈద్గా గుట్ట మీద ఉంది. అక్కడికి వెళ్లాలంటే కాన్వాయ్ కాదు కదా కారులో కూడా వెళ్లలేని పరిస్థితి. గుట్ట దగ్గరికి పోవాలంటే టూవీలర్ మీదే వెళ్లాలి. దీంతో తాను వచ్చిన కాన్వాయిని అపి బైక్ మీద ఎక్కారు మంత్రి ఈటల. తర్వాత బైక్ కూడా గుట్ట దగ్గరికి మాత్రమే వెళ్తుంది. దీంతో నడిస్తేనే గుట్ట మీదకు వెళ్లగలం. వెంటనే బైక్ దిగిన ఈటల గుట్ట ఎక్కి ఈద్గా చేరుకున్నారు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.

నెల రోజుల పాటు పవిత్ర ప్రార్ధనల్లో పాల్గొని ఈ రోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే రంజాన్ కల్లా ఆ గుట్ట ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిరు మంత్రి ఈటల. గుట్ట మీద మెట్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.

click me!