సినీ హీరో రవితేజ తమ్ముడు మృతి

Published : Jun 25, 2017, 11:06 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
సినీ హీరో రవితేజ తమ్ముడు మృతి

సారాంశం

సినీ హీరో రవితేజ సోదరుడు భూపతిరాజు అలియాస్ భరత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీనీ భరత్ నడుపుతున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆయన మరణించాడు.  

 భరత్ పలు సినిమాల్లో నటించాడు. టివి సీరియల్స్ లో కూడా నటించాడు. గతంలో డ్రగ్స్ సప్లై కేసులో కీలక నిందితుడిగా పట్టుబడ్డాడు భరత్. అనేక సందర్భాల్లో భరత్ వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. గతంలో మీడియాపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. 

మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కోత్వాల్ గూడ సమీపంలో సుమారు 140 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతూ ఆగి ఉన్న డిసిఎంను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో భరత్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ