కాంగ్రెస్‌లో రచ్చబండ 'రచ్చ': రేవంత్‌పై సీనియర్ల గుర్రు

By narsimha lodeFirst Published Dec 28, 2021, 9:56 AM IST
Highlights


ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ లో రచ్చకు కారణమైంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు.ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహించకున్నా కాంగ్రెస్ లో రచ్చకు కారణమైంది.


హైదరాబాద్:  ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అయితే Erravalli లో Rachabanda కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రచ్చకు కారణమైంది. Revanth Reddy ని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy కాంగ్రెస్ అధినేత్రి Sonia Gandhiకి, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సోమవారం నాడు లేఖ రాశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకొనేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రేవంత్ రెడ్డి కార్యక్రమాలను రూపొందించారని కూడా ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లిలో  దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం విషయంలో కూడా కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు.

also read:రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు: సోనియా, రాహుల్‌గాంధీలకు లేఖ

ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ విషయమై మాజీ మంత్రి Geetha Reddy కి సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఈ జిల్లాలో పర్యటించే సమయంలో రేవంత్ రెడ్డి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కూడా  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Manickam Tagore కు కూడా ఫిర్యాదు చేశారు.

ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి ఈ నెల 27న రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టారు.ఈ విషయమై తనకు సమాచారం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించే కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండలో పాల్గొనకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.  జూబ్లీహిల్స్ లోని ఇంటి నుండి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు సాయంత్రం రేవంత్ రెడ్డిని పోలీసులు రిలీజ్ చేశారు.

అయితే ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు. కానీ ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణమైంది. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ డైరెక్షన్‌లో నడిచేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని  సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి కోరారు.

ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం గురించి జగ్గారెడ్డిక సమాచారం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పుబట్టారు.  ఈ విషయమై మాణికం ఠాగూర్ తో మాట్లాడుతానని కూడా వి. హనుమంతరావు చెప్పారు. పార్టీలో నేతలను కలుపుకుని పోవాల్సిన రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నాడనిత కాంగ్రెస్ సీనియర్లు కొందరు  ఆరోపణలు చేస్తున్నారు.

జగ్గారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారు.  వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారని సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయమై సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా ఆ పార్టీ సీనియర్లు వెనుకాడడం లేదు. ఎర్రవల్లి రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు.
 

click me!