ఆర్టీసీకి మరో షాక్:రూ. 760 కోట్ల పీఎఫ్ తాఖీదు

By narsimha lodeFirst Published Nov 9, 2019, 6:06 PM IST
Highlights

ఎంవీ ట్యాక్స్, పీఎఫ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆర్టీసీకి నోటీసులు జారీ అయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. పీఎఫ్ కమిషనరేట్‌ కూడ నోటీసులు  పంపించింది. తక్షణమే రూ. 760.62 కోట్లను చెల్లించాలని పీఎప్‌ కమిషనరేట్ కార్యాలయం నోటీసులను ఆర్టీసీ ఎండీకి పంపింది.

ALSO READ:Chalo Tank Bund: : ఎంపీ సంజయ్ అరెస్ట్, టియర్ గ్యాస్ ప్రయోగం

మోటారు వెహికల్ ట్యాక్స్‌ను వెంటనే చెల్లించాలని మూడు రోజుల  క్రితం రవాణ శాఖ జాయింట్ కమిషనర్ నోటీసులు పంపారు. మోటార్ వెహికల్ ట్యాక్స్‌ రూ.452.86 చెల్లించాలని నోటీసులు పంపారు. 

పీఎప్ కమిషనరేట్ కూడ పూర్తి సమాచారంతో 15 రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించింది.  ఆర్టీసీ సిబ్బంది నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎఫ్‌ కట్‌ చేస్తుంది. యాజమాన్యం మరో 12 శాతం ఇస్తోంది. ఇందులో 8.33 ఖాతాకు వెళ్లిపోతుంది. దీనిని తప్పకుండా జమ చేయాల్సింది.

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

మిగిలిన 15.67 శాతాన్ని పీఎప్ కార్యాలయంలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ, కొన్నేళ్లుగా ఇది జమ చేయడం లేదు. ఇప్పటివరకు రూ.760.62 కోట్లు బకాయి ఉన్నట్లు పీఎఫ్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. ఇదే విషయమై 2016, 2017ల్లో రెండుసార్లు పీఎఫ్‌ కమిషనరేట్‌ ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసులు పంపినా ఆర్టీసీ స్పందించలేదు. 

 దీంతో పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌లిస్టులో పెట్టింది. అయినా.. మార్పు రాకపోవడంతో తాజాగా మరో నోటీసు పంపింది.పూర్తి సమాచారంతో 15 రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మను ఆదేశించింది. అలాగే, సీసీఎస్‌కు సంబంధించి రూ.200 కోట్లను బదలాయించాలంటూ బుధవారం కోర్టు నిర్దేశించింది. ఆర్టీసీ వెంటనే రూ.1400 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది.

 

click me!