chalo Tankbund: చుట్టుపక్కల తీవ్ర ఉద్రిక్తత, లాఠీచార్జీలు, అరెస్టులు

By narsimha lodeFirst Published Nov 9, 2019, 3:56 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులపై చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు లాఠీచ ార్జీ చేశారు. ట్యాంక్ బండ్‌ పైకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకొనే ప్రయత్నించారు. 


హైదరాబాద్: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సందర్భంగా హిమాయత్‌నగర్, సెక్రటేరియట్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ వద్ద పోలీసులు ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జీ చేశారు. హిమాయత్‌నగర్‌ వద్ద పోలీసులు దుకాణాలను పోలీసులు మూయించారు.

ALSO READ:Chalo Tank Bund: : ఎంపీ సంజయ్ అరెస్ట్, టియర్ గ్యాస్ ప్రయోగం

శనివారం నాడు చలో ట్యాంక్ బండ్  కార్యక్రమానికి ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ జేఎసీ పిలుపుకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీలు మద్దతును ప్రకటించాయి.చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా  పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల లాఠీచార్జీలో హయత్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ మహిళ కండక్టర్‌‌కు గాయాలయ్యాయి. ట్యాంక్‌ బండ్‌‌పై మరో  ఆర్టీసీ కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

లిబర్టీ వద్ద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్‌పై వస్తున్న బండి సంజయ్‌ను పోలీసులు లిబర్టీ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో లిబర్టీ నుండి ట్యాంక్‌బండ్‌వైపుకు ఆర్టీసీ కార్మికులు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు,ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌ వైపుకు దూసుకెళ్లారు.

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

ఆర్టీసీ కార్మికులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సమయంలో పోలీసులపై ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

మింట్ కాంపౌండ్, సెక్రటేరియట్ వద్ద కూడ ఉద్రిక్తత చోటు చేసుకొంది.ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌వైపుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్‌వైపు పోలీసులు ఆర్టీసీ కార్మికులను తరిమికొట్టారు.

మహిళలపై కూడ పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జీ చేశారని ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఆర్టీసీకి సంబంధం లేని ఓ హోటల్ కార్మికుడిపై కూడ పోలీసులు లాఠీచార్జీ చేశారు.హిమాయత్‌నగర్, లిబర్టీ, ఖైరతాబాద్‌ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే రోడ్డులో దుకాణాలను మూసివేయించారు పోలీసులు. బన్సీలాల్‌పేట వద్ద వి.హెచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాంక్‌బండ్ వైపుకు వస్తున్న టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ను పోలీసులు ఇందిరాపార్క్ వద్ద అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లోనే ఎంపీ ధర్మపురి అరవింద్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ట్యాంక్‌బండ్‌ వైపు బైక్ వస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.


 

click me!