టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు పదో తరగతి విద్యార్థిని గోరుముద్దలు

By narsimha lodeFirst Published Nov 9, 2019, 4:49 PM IST
Highlights

మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య  ఏ పనిచేసినా కూడ సంచలనాలకు కేంద్రంగా మారుతారు. 

జనగామ:మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య  ఏ పనిచేసినా కూడ సంచలనాలకు కేంద్రంగా మారుతారు. తాజాగా ఆయన చేసిన పని ప్రస్తుతం చర్చకు దారి తీసింది.  పదో తరగతి విద్యార్ధినితో ఎమ్మెల్యే రాజయ్య గోరుముద్దలు తిన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిలుపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల క్రితం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలో ప్రదానోపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభ పూర్తైన తర్వాత బోజన విరామ సమయంలో ఎమ్మెల్యే రాజయ్య తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Also Read:chalo Tankbund: చుట్టుపక్కల తీవ్ర ఉద్రిక్తత, లాఠీచార్జీలు, అరెస్టులు

పదో తరగతి విద్యార్ధిని అన్నం తినిపిస్తే ఎమ్మెల్యే రాజయ్య అన్నం తిన్నాడు. ప్రధానోపాధ్యాయుడి అభినందన సభలో టెన్త్ విద్యార్ధిని బాగా ప్రసగించిందని ఎమ్మెల్యే రాజయ్య ప్రశంసలతో ముంచెత్తారు.

ఆ విద్యార్ధినిని తనకు అన్నం తినిపించాలని ఎమ్మెల్యే రాజయ్య కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజయ్య మాత్రం ఖండిస్తున్నారు. అంకుల్  మీకు నేనే భోజనం తినిపిస్తానని ఆ విద్యార్ధినే కోరిందని... విద్యార్ధిని కోరికను తాను కాదనలేకపోయినట్టుగా ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు.

ఎమ్మెల్యే రాజయ్యకు విద్యార్ధిని అన్నం తినిపించే సమయంలో కొదంరు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఆ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఎప్పుడు ఏం చేసినా సంచలనమే, వివాదాస్పదమే.  ఏదో కార్యక్రమం చేసినా కూడ రాజయ్య వార్తల్లో వ్యక్తిగా మారుతున్నాడు. మూడు రోజుల క్రితం స్కూల్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజయ్యకు సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవిని కల్పించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే డిప్యూటీ సీఎం పదవి నుండి రాజయ్యను తప్పించారు.  ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన  కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు.

రాజయ్యను డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గం నుండి భర్తరప్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆ సమయంలో సంచలనంగా మారింది. ఇటీవల కేబినెట్ విస్తరణ జరిగిన సమయంలో కేబినెట్‌లో మాదిగలకు చోటు దక్కకపోవడంపై రాజయ్య మీడియాతో చిట్ చాట్ చేశారు.

అయితే ఈ విషయమై ఆయన టీఆర్ఎస్ కార్యాలయంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తాను మాట్లాడినట్టుగా ఆడియో, వీడియోల ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.తన మాటలను వక్రీకరించారని రాజయ్య ఆ సమయంలో వివరణ ఇచ్చారు. 

"

click me!