సింగరేణి గని పనికి క్యూ గట్టిన ఇంజనీర్లు, ఎంబిఎ లు

First Published Mar 15, 2017, 2:26 AM IST
Highlights

ఉద్యోగంలో కొనసాగే ఆరోగ్యం ఉన్నా, నిరుద్యోగ కొడుకుల కోసం,  పెళ్లికాని  కూతుర్ల కోసం చాలా మంది  వాలంటరీ రిటైర్మెంట్ (విఆర్) తీసుకుంటున్నారు

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విధానం పున: ప్రారంభంకాగానే అనేక బాధాకరమయిన సామాజిక వాస్తవాలు బయటకొస్తున్నాయి.

 

బయట రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగం ప్రబలడంతో  ఎన్నో సింగరేణి కుటుంబాలు ఇళ్లలో పెళ్లికాని నిరుద్యోగ కొడుకుల, పెళ్లి జాప్యం అవుతున్న కూతళ్ల  దిగులు భారంతో క్రుంగిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

ఈ పరిస్థితిలో ఉద్యోగాలతో  వ్యాపారం చేసుకునే బ్రోకర్లు కూడా తయారయ్యారునేది వేరేవిషయం.

 

 మీడియా సమాచారం ప్రకారం, సింగరేణిలో కఠిన మయిన గనికార్మికుల ఉద్యోగాల కోసం కూడా ఇంజనీరింగ్ చదివినోళ్లు, పిజిలు, ఎంబిఎ చదివినోళ్లు, ఇంకా ఇతర రంగాలలో పెద్ద చదువులు చదివినోళ్లు దరఖాస్తు చేస్తున్నారట. ఉద్యోగంలో కొనసాగే ఆరోగ్యం ఉన్నా, చాలా మంది కొడుకుల కోసం, కూతుర్ల కోసం వాలంటరీ రిటైర్మెంట్ (విఆర్) తీసుకుంటున్నారట.

ఇపుడు ప్రభుత్వం కల్పించినఅవకాశం  వినియోగించుకుని విఆర్  తీసుకుంటే  కొడుక్కు ఉద్యోగమొస్తుంది.  బయట ప్రపంచంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే వయసు పైబడుతుంది. ఆపైన ఉద్యోగం రాకపోవచ్చు. బయట చదువు కొద్ది ఉద్యోగం దొరుకుతుందనే ఆశ చాలా మందిలో చచ్చిపోతూ ఉంది.  ఇలాగే, చాలా మంది మైన్ ఉద్యోగుల కూతర్లుకు కట్నం కింద అల్లుళ్లకు ఉద్యోగాలందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తే, మీ కూతురిని పెళ్లిచేసుకుంటామని  పెళ్లికొడుకులు కూడా ముందుకొస్తున్నారట. కూతురు పెళ్లి ముఖ్యమనుకునే తండ్రులు, ఈ అవకాశం జారవిడుచుకోరాదని తాము విఆర్ తీసుకుని ,  ఆ ఉద్యోగాలను అల్లుళ్లకు కట్టబెట్టేందుకు కాబోయే అల్లుళ్ల నుంచి అగ్రిమెంట్లు రాసుకుంటున్నారట. 

 

ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వం సింగరేణి ఉద్యోగుల కుటుంబాలలో అర్హులయన కొడుక్కి, తమ్ముడికి లేదా అల్లుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుకల్పించింది. కాకపోతే,  2016 అక్టోబర్ 11 నాటికి 59 సంవత్సరాలు దాటని ఉద్యోగులంతా ఈ స్కీం ను  ఉపయోగించుకోవచ్చు.  అదే విధంగా 48 సంవత్సరాల లోపు వారికి ఇదివర్తించదు.

 

సింగరెణి కంపెనీ కొత్త గనులుతెరచి ఉత్పత్తి పెంచాలనుకుంటూ ఉండటం వల్ల ఈ విధానంవల్ల కనీసం 30 వేల మందికి ఉద్యోగాలు రావచ్చని అనుకుంటున్నారు.  తక్కువ జీతాలకు ఎక్కడో  హైదరాబాద్ లో తంటాలు పడటం కంటే నిలకడగా ఉండే సింగరేణి ఉద్యోగం మేలని తల్లితండ్రులు, నిరద్యోగులు కూడా  భావిస్తున్నారు. దీని గురించి ఒక  వార్త ఇక్కడుంది.

click me!