
హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌పై విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు దాడికి దిగారు. ఇక్కడ చదువుకుంటున్న ఆంజనేయులు అనే విద్యార్ధి అదృశ్యానికి కాలేజ్ యాజమాన్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యార్ధులు మధ్యాహ్నం విద్యార్ధులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఆపై కాలేజ్‌లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజ్ వద్దకు చేరుకుని విద్యార్ధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.