నేడు ఈడీ కస్టడీకి ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా:9 రోజుల పాటు విచారణ

By narsimha lode  |  First Published Oct 25, 2022, 10:13 AM IST

ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను  ఇవాళ ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుంటారు. 9 రోజుల  పాటు ఈడీ అధికారులు  ఆయనను విచారించారు. ఈ నెల17న సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


హైదరాబాద్:ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు ఇవాళ కస్టడీకి తీసుకుంటారు. సుఖేష్ గుప్తాను తొమ్మిది రోజుల పాటు  కస్టడీకి ఇస్తూ కోర్టు ఈడీ అధికారులకు అనుమతిని  ఇచ్చింది. ఇవాళ్టి నుండి ఈ ఏడాది  నవంబర్ 2వ తేదీ వరకు సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు విచారించనున్నారు. 

ఎంఎంటీసీ నుండి రూ.504 కోట్ల రుణం తీసుకొని ఎగవేసిన కేసువిషయమై  విచారణ  చేసిన  సీబీఐ అధికారులు కీలక విషయాలను సేకరించారు. సీబీఐ  కేసు ఆధారంగా ఈడీ అధికారులు  కూడ రంగంలోకి దిగారు. ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ  సుఖేష్ గుప్తాను కస్టడీకి  ఇవ్వాలని  కోరుతూ ఈ  నెల 20వ తేదీన ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు తొమ్మిది రోజుల పాటు కస్టడీకి అనుమతి  ఇచ్చింది.చంచల్ గూడ  జైలులో ఉన్న సుఖేష్ గుప్తాను పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారు.

Latest Videos

ఈ నెల 16,17 తేదీల్లో ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంబీఎస్  జ్యుయలర్స్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. రెండు రోజుల   పాటు సోదాలు నిర్వహించిన తర్వాత సేకరించిన కీలక సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఈ నెల17న సుఖేష్ గుప్తాను అరెస్ట్  చేశారు.

ఎంబీఎస్ సంస్థల్లో రూ.150కోట్ల విలువైన బంగారం, రూ.1.50 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. సుఖేష్ గుప్తాను విచారిస్తే  కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సుఖేష్ గుప్తా నుండి సమాచారాన్ని సేకరించేందుకు 9 రోజుల పాటు విచారించనున్నారు. ఎంఎంటీసీ సంస్థ నుండి తీసుకున్న బంగారం విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడికి తరలించారనే విషయమై ఈడీ  అధికారులు ఆరా  తీయనున్నారు.

also read:ఎంబీఎస్ ఎండీ సుఖేష్ గుప్తా కస్టడీ:కోర్టులో ఈడీ పిటిషన్

ఎంఎంటీసీ సంస్థ నుండి రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని సుఖేష్ గుప్తా క్రిడెట్ రూపంలో తీసుకున్నారు. అయితే ఈ డబ్బులను ఎంఎంటీసీకి చెల్లించలేదు. ఎంఎంటీసీ సంస్థ  ఇచ్చిన  ఫిర్యాదు ఆధారంగా 2013లో ఎంబీఎస్ సంస్థ ఎండీ సుఖేష్ గుప్తాపైకేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2014లో ఈడీ అధికారులు  చార్జీషీట్ దాఖలు చేశారు.ఎంబీఎస్ ఎండీ సుఖేష్ గుప్తాపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు  కూడ రంగంలోకి దిగారు.ఆరు కేసుల్లో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు . పెద్ద  నగదు నోట్ల రద్దు సమయంలో తప్పుడు పత్రాలను సృష్టించిభారీగా నగదును మార్పిడి చేశారని అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గతంలో కూడ సుఖేష్ గుప్తా అరెస్టయ్యారు. కానీ అతని తీరులో మార్పు రాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 

click me!