హవాలా మార్గంలో లావాదేవీలు,రూ.1.80 కోట్ల నగదు సీజ్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ

By narsimha lodeFirst Published Nov 11, 2022, 3:03 PM IST
Highlights

గ్రానైట్ కంపెనీలు హవాలా రూపంలో లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించామని ఈడీ ప్రకటించింది. రెండురోజులపాటు రాస్ట్రంలోని  పలు  ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలకు సంబంధించిన అంశాలపైఈడీ  ప్రకటించింది

హైదరాబాద్:గ్రానైట్ కంపెనీల్లోసోదాల్లో రూ.1.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ ప్రకటించింది.హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించినట్టుగా ఈడీ తెలిపింది.అక్రమంగా విదేశాలకు గ్రానైట్ తరలించినట్టుగా గుర్తించింది ఈడీ.చైనాకు చెందిన లీహువాన్ తో ఒప్పందాలు కుదర్చుకున్నట్టుగా ఈడీ తెలిపింది.పనామా లీక్స్ వ్యవహరంలో లీహువాన్ కీలకపాత్ర పోషించారు.సముద్ర,రైల్వే మార్గాల ద్వారా అక్రమంగా గ్రానైట్ ను తరలించినట్టుగా ఈడీ తెలిపింది.ప్రభుత్యానికి రావాల్సిన రూ.750 కోట్లను గ్రానైట్ కంపెనీలు ఎగ్గొట్టాయి. గ్రానైట్ కంపెనీల వ్యవహరాలపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించనున్నట్టుగా ఈడీ స్పష్టం చేసిందని ప్రముఖ  తెలుగున్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.10 ఏళ్లపాటు పెద్ద మొత్లంలో హవాలా రూపంలో లావాదేవీలు నిర్వహించారు. అంతేకాదు గ్రానైట్ వ్యాపారుల బినామీ పేర్ల అకౌంట్లను కూడ గుర్తించినట్టుగా ఈడీ వివరించింది.

శ్వేత గ్రానైట్ ,శ్వేత  ఏజన్సీ,వెంకటేశ్వర గ్రానైట్స్ ,పీఎస్ఆర్ గ్రానైట్స్ ,గిరిరాజ్ షిప్పింగ్ లలో రెండురోజులపాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 9,10 తేదీల్లో ఈడీ ,ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు.కరీంనగర్ ,హైద్రాబాద్ లలోని పలుచోట్ల అధికారులు సోదాలునిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించారు.

హైద్రాబాద్, కరీంనగర్ లలో సుమారు 30 టీమ్ లు సోదాలు నిర్వహించాయి.మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఆయన సోదరులు , టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి గ్రానైట్ కంపెనీల్లో కూడా అధికారులు సోదాలు చేశారు.వీరితో పాటు పలు గ్రానైట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. 9 గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన  యజమానులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు .విచారణకు రావాలని ఆదేశించారు.  ఈ నోటీసులతో ఇవాళ హైద్రాబాద్ ఈడీ విచారణకు పాలకుర్తి  శ్రీధర్ హజరయ్యారు.మిగిలి.న కంపెనీలకు చెందిన యజమానులు కూడా విచారణకు విడతలవారీగా హాజరయ్యే అవకాశం ఉంది.

alsoread:గ్రానైట్ సంస్థల్లో సోదాలపై వాస్తవాలు బయట పెట్టాలి: మంత్రి గంగుల కమలాకర్

గ్రానైట్ కంపెనీలు అక్రమ మార్గంలో విదేశాలకు గ్రానైట్ ను తరలించినట్టుగా గతంలోనే ఫిర్యాదులుఅందాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఈ విషయమై ఫిర్యాదులు వెళ్లాయి.ఈ వషయమై  సీబీఐ కేసు నమోదు చేసి విచారణ నిర్వహించింది.ఇదే విషయమై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరోసారి ఈడీ,  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గ్రానైట్ కంపెనీల కార్యాలయాలు,యజమాీనుల ఇళక్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు జరిగిన సమయంలో దుబాయ్ లో ఉన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన  కరీంనగర్ కు తిరిగి వచ్చారు. తాను ఈడీ అధికారుల విచారణకు సహకరించినట్టుగా మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. 

ఈడీ,ఐటీ సోదాలు ముగిసిన తర్వాత  అందుబాటులో ఉన్న మంత్రులతో తెలంగాణ  సీఎం కేసీఆర్ నిన్న ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఈడీ, ఐటీ, ఇతర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై సోదాలు చేసే అవకాశం ఉందని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే

click me!