మంత్రి సబితా అధ్యక్షతన ఇంటర్ బోర్డు మీటింగ్:111అంశాలపై చర్చ

By narsimha lode  |  First Published Nov 11, 2022, 2:20 PM IST

111 అంశాలపై ఇంటర్ బోర్డు ఇవాళ సమావేశమైంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం సాగుతుంది.కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 


హైదరాబాద్:తెలంగాణ ఇంటర్ బోర్డు సమావేశం శుక్రవారంనాడు ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తున్నారు..తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.111 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కీలకమైన అంశాలను ఎజెండాలో చేర్చారు. 

ఇంటర్ విద్యార్ధుల పరీక్షల ఫీజు పెంపు, ప్రైవేట్ కాలేజీల అనుబంధ పీజుల పెంపు,  ఆన్ లైన్ లో ఇంటర్ పరీక్షా పత్రాల వాల్యూయేషన్  వంటి అంశాలపై బోర్డు చర్చించనుంది. సైన్స్ విద్యార్ధులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాక్టీకల్స్ తరహలోనే ఇంగ్లీష్ లో కూడా ప్రాక్టీకల్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ  విషయమై కూడా చర్చించనున్నారు.ఇంటర్ బోర్డులో ఖాళీగా ఉన్న 52 పోస్టులను భర్తీ చేయాలని బోర్డు అధికారులు కోరుతున్నారు. ఈ విషయమై కూడాచర్చించనున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల గుర్తింపుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొంటారు.

Latest Videos

సుమారు 400 ఇంటర్ ప్రైవేట్ కాలేజీలకు తాత్కాలిక గుర్తింపు కొనసాగుతుంది.ఈ కాలేజీలగుర్తింపుపై చర్చించనున్నారు. ఈ ఏడాది ఈ కాలేజీలక  గుర్తింపు ఇవ్వకపోతే ఈ కాలేజీలో చదివిన విద్యార్ధులను ప్రైవేట్ గా పరీక్షలకు అనుమతి ఇచ్చే విషయమై  చర్చించనున్నారు.ఇంటర్ పరీక్షా పలితాలపై గతంలో వచ్చిన వివాదాలపై కూడాచర్చించే అవకాశం లేకపోలేదు.ఈ తరహ వివాదాలు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. ఇంటర్ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రారంభించాలని బోర్డు భావిస్తుంది. జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం బయో మెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేయలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇదే తరహలో జూనియర్ విద్యార్ధులకు బయో మెట్రిక్ హాజరు విధానంపై చర్చించనున్నారు.
 

click me!