Latest Videos

30 గంటలుగా ఈడీ సోదాలు:హైద్రాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ ఫరూక్ ఇంట్లో తనిఖీలు

By narsimha lodeFirst Published Jul 31, 2022, 3:06 PM IST
Highlights

రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.ఈ నెల 30 నుండి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలోనే సీబీఐ అధికారులు ఫరూక్ పై కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్:రైల్వే కాంట్రాక్టర్ Ijaz Farooq నివాసంలో  Enforcement Directorate సోదాలు కొనసాగుతన్నాయి.ఈ నెల 30వ తేదీ నుండి ఫరూక్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Tarnaka లోని రైల్వే కాంట్రాక్టర్  ఫరూక్ ఇంట్లో శనివారం నాడు తనిఖీలు ప్రారంభించారు.ఆదివారం నాడు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇజాజ్ ఇంట్లో సుమారు 30 గంటలుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని మీడియా రిపోర్టు చేసింది.   ఇజాక్ ఫరూక్ నివాసంలో భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  టీవీ 9 కథనం ప్రసారం చేసింది.  మరో వైపు ఫరూక్ నివాసంలో కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారని ఈ కథనం తెలిపింది. 

నకిలీ బిల్లులతో వందల కోట్లు స్కాం చేశారని ఫరూక్ పై ఆరోపణలున్నాయి..ఇటీవలనే ఫరూక్ పై  సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తార్నాకలోని పరూక్ నివాసంలో ఈడీ అధికారులు నిన్నటి నుండి  సోదాలు చేస్తున్నారు. హవాలా రాకెట్ వ్యవహరంలో ఇజాజ్ ఫరూక్ పై ఆరోపణలున్నాయి.  ఈ తనిఖీల సమయంలో సుమారు రూ. 100 కోట్ల విలువైన నకిలీ బిల్లులను ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 చానెల్ తన కథనంలో ప్రసారం చేసింది.  మరో వైపు ఫరూక్ ఇంట్లో ఈడీ సోదాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఫరూక్ అనుచరులు దాడికి దిగినట్టుగా టీవీ9 తన కథనంలో పేర్కొంది. 

హైద్రాబాద్ లో కేసినో వ్యవహరంలో చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు ఈ నెల 27 నుండి  28 వ తేదీ తెల్లవారుజాము వరకు సోదాలు చేశారు ఈ సోదాల తర్వాత ప్రవీణ్, మాధవరెడ్డిలను విచారణకు రావాలని కూడా అధికారులు ఆదేశించారు.

click me!