మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు..

By Sumanth Kanukula  |  First Published Sep 5, 2023, 9:22 AM IST

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.


తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిని నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే చైనాకు గ్రానైట్ ఎక్స్‌పోర్ట్స్‌లో అవకతవకలు జరిగినట్టుగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 

7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రూ. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. హవాల మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా తేల్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 

Latest Videos

ఇక, శ్వేతా గ్రానైట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు గతంలో కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోమారు శ్వేతా గ్రానైట్ కంపెనీకి చెందిన ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. 
 

click me!