క్యాసినో వ్యాపారం నిర్వహించే చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
హైదరాబాద్: క్యాసినో వ్యాపారం నిర్వహించే చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే వారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. థాయ్ లాండ్ లో చీకోటీ ప్రవీణ్ కుమార్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడడంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 15న విచారణకు రావాలని ఆ నోటీసులో ప్రవీణ్ కుమార్ ను ఈడీ అధికారులు కోరారు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ కేసు నమోదు చేసింది.తాజాగా చీకోటి ప్రవీణ్ కుమార్ తో పాటు సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
తాజాగా చీకోటి ప్రవీణ్ కుమార్ తో పాటు సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో కేసులో గతంలో చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చీకోటి ప్రవీణ్ కుమార్ గ్యాంగ్ పట్టుబడింది. దీంతో ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
also read:ఏప్రిల్‌లో రెండోసారి :థాయ్‌లాండ్ లో చీకోటి గ్యాంబ్లింగ్ దందా
క్యాసినో కు ఎక్కడ అనుమతి ఉంటుందో అక్కడే క్యాసినో వ్యాపారం నిర్వహిస్తానని చీకోటి ప్రవీణ్ కుమార్ గతంలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రెండు దఫాలు చీకోటి ప్రవీణ్ కుమార్ గ్యాంగ్ గ్యాంబ్లింగ్ నిర్వహించింది. ఏప్రిల్ 16 నుండి 21 వరకు ఏప్రిల్ 27 నుండి మే 1వ తేదీ వరకు గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 16 నుండి 21 వరకు ఇండియా నుండి తీసుకెళ్లిన వారితో ప్రవీణ్ కుమార్ బృందం ఇండియాకు చేరింది. అయితే ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు గ్యాంబ్లింగ్ కోసం వెళ్లిన చీకోటి ప్రవీణ్ కుమార్ బృందానికి చుక్కెదురైంది. థాయ్ లాండ్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కుమార్ బృందాన్ని అరెస్ట్ చేశారు. చీకోటి ప్రవీణ్ కుమార్ సహా 83 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.చీకోటి ప్రవీణ్ కుమార్ సహా ఇతరులకు బెయిల్ మంజూరు కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ కు అనుమతి లేదని తనకు తెలియదని చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియాకు చెప్పారు.