ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చీకోటి ప్రవీణ్ కేసీనో దందా: కీలక విషయాలు సేకరించిన ఈడీ

By narsimha lode  |  First Published Jul 31, 2022, 11:07 AM IST


చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తును  ముమ్మరం చేశారు. ఏడు ప్రాంతాల్లో ప్రవీణ్ కేసినో నిర్వహించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.ఈడీ అధికారులు తాము సేకరించిన సమాచారం ఆధారంగా ఆగస్టు 1న విచారణ నిర్వహించనున్నారు.
 


హైదరాబాద్: Chikoti Paveen  నిర్వహించిన Casino వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.కేసీనో వ్యాపారం ఎక్కడైతే లీగల్ గా ఉందో అ  ప్రాంతంలో కేసీనో నిర్వహించినట్టుగా చీకోటి ప్రవీణ్ ఒప్పుకున్న విషయం తెలిసిందే.

ఈ నెల 27వ తేదీనుండి 28వ తేదీ తెల్లవారు జాము వరకు చీకోటి ప్రవీణ్ తో పాటు Madhava Reddy  ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సుమారు 20 గంటల పాటు Enforcement Directorate అధికారులు సోదాలు చేశారు. 

Latest Videos

undefined

చీకోటి ప్రవీణ్ సహా, మాధవరెడ్డిలను ఆగస్టు 1వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.  చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చీకోటి ప్రవీణ్ కు చెందిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ప్రవీణ్ మొబైల్ లోని వాట్సాప్ సమాచారాన్ని ఈడీ అధికారులు  విశ్లేషిస్తున్నారు. ప్రవీణ్ పలువురు రాజకీయ నేతలకు బినామీగా వ్యవహరించాడని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  హవాలా మార్గంలో ప్రవీణ్ డబ్బును తరలించారని ఆ కథనం తెలిపింది. 

కేసీనో లో డబ్బులు గెలుచుకున్న వారికి హవాలా రూపంలో డబ్బులను అందించారని ఈడీ అధికారులు గుర్తించారని కూడా ఈ కథనం వివరించింది.  నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో  చీకోటి ప్రవీణ్ ఏడు కేసినో క్యాంపులు నిర్వహించారని ఈడీ అధికారులు గుర్తించారు. 

చీకోటి ప్రవీణ్  కేసినో వ్యాపారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హవాలా రూపంలో ప్రవీణ్ డబ్బులు తరలించడానికి సహకరించింది ఎవరనే విషయమై కూడా ఈడీ అధికకారులు ఆరా తీస్తున్నారని ఆ కథనం ప్రసారం చేసింది. 

20 గంటల పాటు ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా ప్రవీణ్ ను, మాధవరెడ్డిలను ఈడీ అధికారులు ఆగష్టు 1న విచారించనున్నారు.ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని ప్రవీణ్ చెప్పారు. 

చీకోటి ప్రవీణ్ కు రాజకీయ, సినీ ప్రముఖులతో కూడా సంబంధాలున్నాయని కూడా ఈడీ అధికారులు గుర్తించారు. కేసినో వ్యాపారానికి సంబంధించి ప్రచారం కోసం సినీతారలను కూడా ప్రవీణ్ ఉపయోగించుకొన్నాడని ఈడీ గుర్తించింది.  ఈ ప్రచారం కోసం సినీతారలకు ఎంత ఖర్చు చేశారనే విషయాలపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ప్రవీణ్  బర్త్ డే రోజున సంపత్ అనే వ్యక్తి రూ. 2 కోట్లను ఖర్చు చేశాడు.  Sampath ఆర్ధిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది. 

also read:క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. ఏడుగురికి నోటీసులు.. బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు..!

ప్రవీణ్, మాధవరెడ్డిలతో పాటు ఇంకా ఎవరెవరు ఈ వ్యవహరంలో ఉన్నారనే విషయమై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులతో  ప్రవీణ్ కు సంబంధాలున్నాయనే విషయమై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏడు మాసాల కాలంలో ఏడు దేశాల్లో చీకోటి ప్రవీణ్ కేసినో నిర్వహించినట్టుగా గుర్తించారు. ఈ నెలలోనే రెండు దఫాలు శ్రీలంకలో కేసినో నిర్వహించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ఎన్టీవీ కథనం తెలిపింది. 
 

click me!