ఈఎస్ఐ స్కాం: ముగిసిన ఈడీ సోదాలు... నాయిని అల్లుడి మాజీ పీఎస్ అరెస్ట్

By Siva KodatiFirst Published Apr 10, 2021, 5:41 PM IST
Highlights

ఈఎస్ఐ స్కాం కేసులో హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి సహా ఆయన వద్ద పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన ముకుంద్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.

ఈ క్రమంలో ముకుంద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు తనిఖీలను వీడియో చిత్రీకరణ చేశారు. 

ముకుంద్ రెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇంట్లో నగదు, నగలును ఈడీ గుర్తించింది. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి ఇంట్లోనూ నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం వున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 

Also Read:ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్: చిట్‌ఫండ్ సంస్థల్లో దేవికా రాణి పెట్టుబడులు

మరోవైపు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి నివాసాల్లోనూ ఈడీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు ఈ  కుంభకోణం కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. ఈ స్కామ్ లో 25 మంది నిందితులను గతంలో అరెస్ట్ చేసింది.

కుంభకోణంలో వచ్చిన డబ్బును విదేశాలకు బదిలీ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. ముకుంద్ రెడ్డిని ప్రశ్నించి కీలక విషయాలు రాబట్టే అవకాశం వుంది. 

click me!