పెరుగుతున్న కేసులు.. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు: ప్రైవేట్ ఆసుపత్రులకు ఈటల వార్నింగ్

By Siva KodatiFirst Published Apr 10, 2021, 5:12 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. కరోనా అంటే ఏడాది క్రితం వున్న భయం ఇప్పుడు లేదని ఈటల చెప్పారు. కోవిడ్ ట్రీట్‌మెంట్‌తో పాటు నాన్‌కోవిడ్ రోగులకు వైద్యం అందించాలని రాజేందర్ సూచించారు.

ప్రజల దృష్టిలో కార్పోరేట్ ఆసుపత్రులపై సరైన భావన లేదని ఈటల చెప్పారు. అన్ని చోట్లా 108 వాహనాలు అందుబాటులో వున్నాయన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో నిబంధనల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 14 వేలకు పైగా బెడ్స్ వున్నాయని ఈటల చెప్పారు. తెలంగాణలో లాక్‌డౌన్ ప్రసక్తే లేదని.. సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని రాజేందర్ పేర్కొన్నారు.

ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని.. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయని... కేసుల సంఖ్య పెరిగినా, వైరస్ తీవ్రత తగ్గుతుందని రాజేందర్ వెల్లడించారు. మిగతా రోగాలకు ఎలా ట్రీట్ చేస్తున్నారో.. కోవిడ్‌ను ఇప్పుడు అలాగే ట్రీట్‌మెంట్ చేస్తున్నారని ఈటల చెప్పారు. 

click me!