టెండర్ ఓటు ఎఫెక్ట్: మహబూబ్ నగ‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు

By narsimha lodeFirst Published Jan 23, 2020, 2:53 PM IST
Highlights

మహాబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 41 వార్డు 196 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.


మహాబూబ్ నగర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 41వ వార్డులో ని 196 పోలింగ్ కేంద్రంలో  టెండర్ ఓటు నమోదైంది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. ఐదుగురును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకొన్నారు.

మహాబూబ్నగర్ పట్టణంలోని 41వ వార్డులో 196 పోలింగ్ కేంద్రంలో ఓ  వ్యక్తి  టెండర్ ఓటు వేశారు.  ఈ విషయాన్ని ఎన్నికల అధికారి సీరియస్‌గా తీసుకొన్నారు. టెండర్ ఓటు నమోదైన 196 పోలింగ్ కేంద్రంలో  రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

టెండర్ ఓటు దాఖలు కావడంతో  ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. టెండర్ ఓటు  ఈ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ కు కారణమైంది. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101 పోలింగ్ కేంద్రంలో  ఓ టెండర్ ఓటు బుధవారం నాడు దాఖలైంది. 

దీంతో కామారెడ్డి 41వ వార్డులోని 101 పోలింగ్ కేంద్రంలో కూడ రీ పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.  ఇప్పటికే మహాబూబ్ నగర్ పట్టణంలోని 41వ వార్డు 196 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

ఒక్క పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు దాఖలైతే  రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. 


 

click me!