మైనర్ బాలికపై మాజీ సర్పంచి అఘాయిత్యం.. గ్రామస్థుల దేహశుద్ధి

By telugu teamFirst Published Jan 23, 2020, 9:22 AM IST
Highlights

చాలా సేపటి నుంచి కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లి వెతకడం మొదలుపెట్టింది. ఆ సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి అరుపులు వినపడటంతో...  బాలిక తల్లి అక్కడికి పరుగులు తీసింది. అప్పటికే కూతురు ఏడుస్తూ బయటకు పరుగులు తీయడం చూసింది.
 

 అతను గతంలో గ్రామానికి సర్పంచిగా వ్యవహరించాడు. గ్రామ పెద్ద అని అందరూ గౌరవిస్తారు. వయసులోనూ పెద్దవాడే. అలాంటి వ్యక్తి... మనవరాలి వయసు ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు మాత్రం ఊరుకోలేదు. గ్రామ పెద్ద అని ఇన్నాళ్లు ఇచ్చిన మర్యాదను పక్కన పెట్టి చావబాదారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక  తన తండ్రికి ఫోన్ చేసేందుకు మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటిరెడ్డి(63) ఇంటికి వెళ్లింది. ఆమె తన తండ్రితో ఫోన్లో మాట్లాడిన తర్వాత మిరపకాయలు తెమ్మని కోటిరెడ్డి సదరు బాలికకు చెప్పాడు. ఆమె వాటిని తీసుకొని తిరిగి కోటిరెడ్డి ఇంటికి వెళ్లింది. అప్పుడు ఎవరూ చూడకుండా బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కాగా... చాలా సేపటి నుంచి కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లి వెతకడం మొదలుపెట్టింది. ఆ సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి అరుపులు వినపడటంతో...  బాలిక తల్లి అక్కడికి పరుగులు తీసింది. అప్పటికే కూతురు ఏడుస్తూ బయటకు పరుగులు తీయడం చూసింది.

Also Read మా ఆయన చాలా మంచోడు అని మెసేజ్ చేసి... మహిళ ఆత్మహత్య.

ఏం జరిగిందని ఆరా తీయగా.. బాలిక జరిగిన ఘోరాన్ని వివరించింది.  ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని చితకబాదారు. కోటిరెడ్డి ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో అతని ఇంటిని చుట్టుముట్టారు. బయటకు వచ్చిన తర్వాత అతనిపై దాడిచేసి దారుణంగా కొట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నిందితుడికి గ్రామస్థుల దాడిలో తీవ్రగాయాలు కావడంతో..చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!