కేసీఆర్ వార్నింగ్: 7గురు మంత్రులకు గండం, టెన్షన్

By telugu teamFirst Published Jan 23, 2020, 11:11 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏడుగురు తెలంగాణ మంత్రులకు గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మంత్రులకు ఉద్వాసన తప్పదని కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏడుగురు తెలంగాణ మంత్రులు చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించకపోతే మంత్రి పదవులు ఊడుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడుగురు మంత్రులు కష్టాల పాలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించే అవకాశాలే ఉన్నాయి. అయితే, ఏడు జిల్లాల్లో పరిస్థితి మంత్రులకు ఎదురు తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. వారిలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైనవారు కూడా ఉన్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నవారు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

కొంత మంది మంత్రుల సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులను గెలిచే అవకాశాలున్నాయి. అయితే, ఆ మంత్రులకు చెందిన జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పరిస్థితి సజావుగా లేదని అంటున్నారు. మెజారిటీ వార్డులు గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్ కు లేదని అంటున్నారు. నామినేటెడ్ సభ్యుల ద్వారా చైర్ పర్సన్ పదవులను దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ మంత్రులకు గండం తప్పదని అంటున్నారు.

మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పోరేషన్లలో తమ పార్టీ స్వీప్ చేస్తుందని టీఆర్ఎస్ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు తమకన్నా ఎంతో వెనకబడి ఉన్నాయని అంటున్నారు. 

లోకసభ ఎన్నికల్లో బిజెపి నాలుగు, కాంగ్రెసు మూడు స్థానాలు గెలుచుకున్నాయి. అదే ట్రెండ్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించవచ్చుననే అంచనా కూడా ఉంది. అయితే, ఆ పార్టీలు లోకసభ ఎన్నికల్లో పొందిన ఓట్లను మున్సిపల్ ఎన్నికల్లో పొందడం కష్టమని టీఆర్ఎస్ భావిస్తోంది. 

click me!