దుమ్ము రేపుతున్న తెలంగాణ టూరిజం

First Published Sep 27, 2017, 3:24 PM IST
Highlights
  • 8 అవార్డులు అందుకున్న టూరిజం శాఖ
  • ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

టూరిజానికి 8 అవార్డులు

తెలంగాణ టూరిజానికి అవార్డలు పంట పండింది. ఏకంగా 8 అవార్డులను దక్కించుకుని దేశంలోనే తెలంగాణ టూరిజం అగ్ర స్థానంలో నిలిచిందని టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రపంచ టూరిజం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి శ్రీ రాంనాధ్ కొవింద్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

ఈ అవార్డులు తీసుకున్న వారిలో తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం,టూరిజం కమీషనర్ సునీత భగవత్,టూరిజం MD క్రిస్టినా చోగ్తు,చౌముల్లా ప్యాలస్   స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, GHMC మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్థన్ రెడ్డి,  వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆంత్రమాలి, వరంగల్ మేయర్ , వరంగల్ మునిసిపల్  కార్పొరేషన్  కమిషనర్, కాసినాధ్ సీనియర్ గైడ్ లు ఉన్నారు.

న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం  తరుపున వెళ్లిన ఈ ప్రతినిధులు అవార్డులను స్వీకరించారు. మన దేశ టూరిజం  చరిత్రలోనే ఒక రాష్ట్రానికి 8 జాతీయ స్థాయి అవార్డ్స్ రావడం ఇదే ప్రథమం అని బుర్రా వెంకటేశం తెలిపారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!