ఢిల్లీ లిక్కర్ స్కాంలో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇవాళ విచారణకు రావాలని కోరారు. గతంలో సీబీఐ, ఈడీ అధికారులు ఈ సంస్థలో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కాంలో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. మంగళవారం నాడు విచారణకు హాజరుకావాలని సీబీఐ కోరింది. అరుణ్ రామచంద్రపిళ్లైతో పాటు పలువురికి బుచ్చిబాబు సీఏగా పనిచేస్తున్నారు. రాబిన్ డిస్టిలరీస్ కు బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న సుమారు 9గంటల పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 16,17 తేదీల్లో గోరంట్ల అసిసోయేట్స్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సమయంలో పలుసంస్థలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై సీబీఐ,ఈడీ అధికారులు మరింత దూకుడుగా దర్యాప్తు చేస్తున్నాయి..ఈ కేసులో అరెస్టైన వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ రెండు దర్యాప్తు సంస్థలు విచారణను నిర్వహిస్తున్నాయి.అంతేకాదు గతంలో నిర్వహించిన సోదాల సమయంలోసేకరించిన డాక్యుమెంట్లపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రపిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. అరుణ్ రామచంద్రపిళ్లైతో పాటు రాబిన్ డిస్టిలరీస్ సంస్థకు చెందిన డైరెక్టర్ల నివాసాల్లో,కార్యాలయాల్లో గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు .గత వారం రోజుల క్రితం హైద్రాబాద్ కుచెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఢిల్లికి పిలిపించారు. విచారణ నిర్వహించిన అనంతరం అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన అభిషేక్ రావును వారం రోజుల పాటు కస్టడీకి తీసుకొని సీబీఐ అధికారులు విచారించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆప్ సర్కార్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలంగాణలో అధికారంలో ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరికి ఈ స్కాంతో ప్రమేయం ఉందని బీజేపీ విమర్శించింది. అయితే ఈ ఆరోపణలను టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలు చేసిందని టీఆర్ఎస్ ప్రకటించింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-2022 అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురిపై సీబీఐ కేసులు న మోదు చేసింది. గత ఏడాది నవంబర్ నుండి ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఈ ఏడాది జూలైలో ఈ పాలసీని అరవింద్ కేజ్రీవాల్ ఈ పాలసీని రద్దు చేశారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ, సీబీఐ అధికారులు పలు దఫాలు సోదాలు నిర్వహించారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు నిన్ననే విచారించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే హైద్రాబాద్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారురేపు ఎవరి వంతు వస్తోందనే భయం కూడా లేకపోలేదు.