ఉద్రిక్తత... వైఎస్ షర్మిల కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

By Arun Kumar PFirst Published Jun 11, 2021, 11:20 AM IST
Highlights

 కోవిడ్ నిబంధనలను ఉళ్లంగించారంటూ రంగారెడ్డి జిల్లా చింతపల్లి వైఎస్ షర్మిల కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. 

వికారాబాద్: రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించేందుకు వికారాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్ షర్మిల కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుండి వికారాబాద్ జిల్లాలోని పరిగికి భారీ కాన్వాయ్ తో బయలుదేరారు షర్మిల. దీంతో కోవిడ్ నిబంధనలను ఉళ్లంగించారంటూ చింతపల్లి వద్ద పోలీసులు ఈ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. 

కేవలం రెండు వాహనాలనే ముందుకు వెల్లడానికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిల మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అనుమతి మేరకు షర్మిల వాహనం వెంట మరో వాహనం మాత్రమే వెళ్లింది. 

read more  

రాష్ట్రంలో రైతుల పరిస్థితిని తెలుసుకొనేందుకు షర్మిల వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని ఆమె పరిశీలించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను  ఆమె పరిశీలిస్తారు.  

ఇదిలావుంటే ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై పనిచేయాలని షర్మిల భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె తలపెట్టింది.  ఇందులో భాగంగానే  ఆమె తాజాగా వికారాబాద్ జిల్లాలో టూర్ ను ఎంచుకొంది. 

పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు షర్మిల అన్ని సిద్దం చేసుకున్నారు. ప్రజల ఎజెండాయే తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని షర్మిల ప్రకటించింది. వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీని ప్రకటించనున్నట్టుగా  షర్మిల తెలిపింది. 


 

click me!