ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు..

By Sairam Indur  |  First Published Mar 15, 2024, 5:02 PM IST

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం సోదాలు జరుపుతోంది.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు సోదాలు చేపడుతున్నారు. కవితను నిందితురాలిగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించే ఈ సోదాలు జరిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు తమ ముందు హాజరుకావాలని కవితకు ఐటీ, ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె నోటీసులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే.. ఈ సారి 400పైగా సీట్లు - ఒపీనియన్ పోల్..

Latest Videos

undefined

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కింద అనుచిత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత 'సౌత్ గ్రూప్'లో భాగమని ఈడీ తన చార్జిషీట్ లో ఆరోపించింది. ఈ ఆరోపణలను ఖండించిన కవిత ఈడీ నోటీసులను మోడీ నోటీసులుగా అభివర్ణించారు.

‘ఈ పాకిస్థానీలకు ఇంత ధైర్యమా ?’ శరణార్థుల నిరసనపై కేజ్రీవాల్ అసహనం

కాగా.. ఈడీ అధికారులు ప్రస్తుత సోదాల్లో ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ కు సంబంధించిన బిజినెస్ ల వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. వాస్తవానికి ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం వాదలను జరిగాయి. తరువాత అవి ఈ నెల 19వ తేదీకి వాయిదా పడ్డాయి. అయితే ఇది జరిగిన కొంత సమయానికే ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి సోదాలు మొదలుపెట్టారు.

కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదు.. 75% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు.. జల్ జీవన్ మిషన్ విజ‌యాలు !

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు నాలుగు టీమ్ లు గా విడిపోయారు. ఒక్కో టీమ్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని ముందు ఐటీ అధికారులు అనుకున్నా.. తరువాత ఈడీ అధికారులని తేలింది. 

click me!