తెలంగాణలో బీజేపీకి రెట్టింపు సీట్లు.. బీఆర్ఎస్‌కు భారీ నష్టం: న్యూస్ 18 సర్వే

By Mahesh KFirst Published Mar 14, 2024, 7:15 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శించనుంది. న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే అంచనాల ప్రకారం బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకుంటాయి.
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటు షేరింగ్ సాధించిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటుందనే అంచనాలు ఇది వరకే ఉన్నాయి. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికలకు ఎక్కువ ఆదరణ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ విశ్లేషణలకు అనుగుణంగా తాజాగా న్యూస్ 18కు చెందిన మెగా ఒపీనియన్ పోల్ సర్వే అంచనాలు వెలువరించింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందని తెలిపింది. అంతేకాదు, గతంలో కంటే రెట్టింపు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ దారుణంగా నష్టపోతుందనీ పేర్కొంది. ఆ సర్వే అంచనాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే అంచనా ప్రకారం, ఇందులో బీజేపీ గరిష్టంగా 8 సీట్లను గెలుచుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లతో సరిపెట్టుకుంటుంది. గతంలో 9 ఎంపీ సీట్లను కలిగి ఉన్న బీఆర్ఎస్ రెండు సీట్లకు పరిమితం అవుతుంది. మజ్లిస్ లేదా ఇతరులు ఒక సీటు గెలుచుకుంటుంది.

గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ 9 సీట్లు, బీజేపీ 4 సీట్లు,  కాంగ్రెస్ 3 సీట్లు, ఎంఐఎం పార్టీ ఒక్క సీటు గెలుచుకుంది. ఈ సారి బీఆర్ఎస్ ఏడు సీట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని, అదే బీజేపీ రెట్టింపు స్థానాలను గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ కూడా రెట్టింపు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

click me!