గంగులకు ఈడీ షాక్: మంత్రి గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు

By narsimha lode  |  First Published Aug 5, 2021, 10:05 AM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడేక్కాయి. మంత్రి గంగుల కమలాకర్ కు ఈడీ షాకిచ్చింది. మంత్రికి చెందిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.



కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగే సమయంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు షాక్ తగిలింది. మంత్రికి సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.మంత్రికి చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మంత్రిపై గతంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. 

also read:హుజూరాబాద్ బైపోల్: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్, దళితబంధుకు చెక్

Latest Videos

undefined

తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్‌రెడ్డి, గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపి ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక్కడి కంపెనీలు గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ ఏడాది మే 29న ఉన్నతాధికారులకు ఓ నివేదిన ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సీబీఐ అధికారులకు కూడ ఫిర్యాదులు చేశారని సమాచారం. ఈ విషయమై సీబీఐ అధికారులు కూడ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

click me!