పెళ్లైన 23 ఏళ్లకు కవలలు జన్మనిచ్చి.. అంతలోని ఇన్ఫెక్షన్ కాటుకు బలై...

By AN TeluguFirst Published Aug 5, 2021, 9:19 AM IST
Highlights

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం ఎఖీన్ పూర్ కు చెందిన  పొన్నం స్వరూప  (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయ్యి 23 ఏళ్లు అయినా వారికి సంతానం లేదు. సంతానం కోసం ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. 

జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరిన ఓ మహిల. 15 రోజులకే అవి ఆవిరై ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది. దీంతో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. లేకలేక కలిగిన సంతానాన్ని తనివి తీరా చూసుకోక ముందే తనువు చాలించింది. 

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం ఎఖీన్ పూర్ కు చెందిన  పొన్నం స్వరూప  (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయ్యి 23 ఏళ్లు అయినా వారికి సంతానం లేదు. సంతానం కోసం ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు.  ఈ ప్రయత్నం ఫలించి 10 నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. 

జూలై 19న ఆమె మెట్పల్లి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది.  శిశువులు బరువు తక్కువగా ఉండడంతో పుట్టిన వెంటనే వారిద్దరిని అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ పిల్లల ఆస్పత్రికి తరలించారు.  పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్న క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ కి వెళ్ళింది.  తన పిల్లలతో ఆనందంగా గడపటం కంటే ముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది.

click me!