బంగారం స్మగ్లింగ్ కేసు.. అగర్వాల్ ఫ్యామిలీకి ఈడీ షాక్, రూ.25 కోట్ల ఆస్తులు అటాచ్‌

Siva Kodati |  
Published : Sep 01, 2021, 08:18 PM IST
బంగారం స్మగ్లింగ్ కేసు.. అగర్వాల్ ఫ్యామిలీకి ఈడీ షాక్, రూ.25 కోట్ల ఆస్తులు అటాచ్‌

సారాంశం

బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్‌కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది

బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్‌కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది కోల్‌కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఇప్పటికే ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. విదేశాలకు ఎగుమతి పేరుతో ఎంఎంటీఏసీ, ఎస్‌టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అగర్వాల్ అక్రమంగా దేశీయంగా వ్యాపారం చేసినట్లు అభియోగాలున్నాయి.  

PREV
click me!

Recommended Stories

ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే
Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే