ఈ-కామర్స్ సంస్థలకు షరతులతో అనుమతి: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

Published : May 25, 2021, 12:34 PM IST
ఈ-కామర్స్ సంస్థలకు  షరతులతో అనుమతి: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

సారాంశం

ఈ- కామర్స్ ప్రతినిధులకు షరతులతో మాత్రమే లాక్‌డౌన్ సమయంలో అనుమతులు ఇచ్చినట్టుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

హైదరాబాద్: ఈ- కామర్స్ ప్రతినిధులకు షరతులతో మాత్రమే లాక్‌డౌన్ సమయంలో అనుమతులు ఇచ్చినట్టుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. కేవలం కోవిడ్ రోగులకు మెడిసిన్స్ తో పాటు ఆహారం సరఫరాకు మాత్రమే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.

also read:లాక్‌డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్‌డెలివరీ యథాతథం

జోమాటో, స్విగ్గీ సంస్థలు   సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు.వ్యవసాయ పనులకు ఎక్కడా ఆటంకం లేకుండా చర్యలు తీసుకొన్నామన్నారు. చిన్న పట్టణాలనుండి హైద్రాబాద్ వరకు లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 

లాక్‌డౌన్  సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి  ఫైనాల్టీ వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అనవసరంగా ఎవరూ కూడ రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు.ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి ప్రవేశించేవారు ఈ-పాస్ తీసుకోవాలని ఆయన కోరారు.ఈ పాస్ ఎక్కడ తీసుకొన్నా అనుమతిస్తామని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే