నూట పది రూపాయిలు ఇచ్చి టిక్కెట్ కొని నిలబడి పోవాల్నా అని ఓ యువకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమకు సీటు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మీ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే దీని వల్ల బస్సులన్నీ ఫుల్లుగా ప్రయాణిస్తున్నాయి. ఇందులో అధికంగా మహిళలే ఉంటున్నారు. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోకరంగా ఉన్నా.. మగవాళ్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో మగవాళ్లకు సీట్లు దొరకడం లేదు.
మహాలక్ష్మీ పథకం వల్ల తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసింది. దీని ద్వారా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది.
కాగా.. చాలా బస్సుల్లో మహిళలతోనే నిండిపోతున్నాయి. దీంతో చాలా మంది పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా టిక్కెట్ కు డబ్బులు చెల్లిస్తున్నామని, అలాంటప్పుడు ఎందుకు నిలబడి వెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోలు గతంలో చాలా బయటకు వచ్చాయి. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చి, అది సోషల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ?
తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఫుల్లుగా నిండిపోయింది. ఆ బస్సు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలియదు గానీ హైదరాబాద్ కు వెళ్తోందని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఆ బస్సులో చాలా మంది మహిళలు, పలువురు పురుషులు కూడా సీట్లలో కూర్చొని ఉన్నాడు. చాలా సేపటి నుంచి సీటు దొరకక్కపోవడంతో ఓ యువకుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఐదు రోజుల నుంచి ఇలా బస్సులో హైదరాబాద్ కు వెళ్తున్నానని, కానీ ఒక్క రోజు కూడా సీటు దొరకడం లేదని వాపోయాడు. నూట పది రూపాయిలు పెట్టి టిక్కెట్ కొని, నిలబడి పోవాల్నా అని ప్రశ్నించాడు.
ఫ్రీ బస్ వల్ల మాకు సీట్లు దొరకట్లేదు pic.twitter.com/rM97vhOweP
— Telugu Scribe (@TeluguScribe)సీట్లలో ఎక్కువగా మహిళలే కూర్చుంటున్నారని, వారు ఎక్కడ చేయి ఎత్తితో బస్సు అక్కడ ఆపుతున్నారని ఆ యువకుడు చెప్పారు. దీని వల్ల గంట ప్రయాణం రెండున్నర గంటలు అవుతోందని ఆక్రోశం వెల్లగక్కాడు. మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశాడు.
ఆ యువకుడి వెనకాలే చేతులు వణకుతున్నా.. పైన గట్టిగా పట్టుకొని నిలబడిన ఓ వృద్ధుడు కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళల కోసం బస్సులు కేటాయించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. వెనకాల కూర్చున్న మరి కొందరు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.