
హైద్రాబాద్: BJLP శాసనసభపక్ష సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే Raghunandan Rao గైర్హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీ నుండి Telangana Assembly సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై BJP శాసనసభపక్షం శుక్రవారం నాడు సమావేశమైంది. అయితే ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డుమ్మా కొట్టారు. రఘునందన్ రావు ఏ కారణాలతో సమావేశానికి హాజరు కాలేదో తెలియాల్సి ఉంది. ఈ సమావేశానికి రాలేనని ముందే రఘునందన్ రావు పార్టీ శాసనసభపక్షానికి సమాచారం ఇచ్చారా లేదా అనే వషయం స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై బీజేపీ శాసనసభపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరు కాలేదు. అయితే రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చ సాగుతుంది.
వీడియో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ వ్యూహా రచన చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఇతర అంశాలపై కూడా అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్ ను బీజేపీ నిలదీయనుంది.
ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు గవర్నర్ ప్రసంంగం ఉండదు. టెక్నికల్ సమస్యలతోనే గవర్నర్ ప్రసంగం ఉండదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వషయమై విపక్షాలు చేసిన విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. టెక్నికల్ సమస్యలపై అవగాహన లేకుండానే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రులు మండి పడ్డారు. గత ఏడాదిలో జరిగిన 8వ సెషన్ కు కొనసాగింపుగానే ఈ సమావేశాలు సాగుతున్నాయి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. దీంతోనే గవర్నర్ ప్రసంగం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
2021 లో 8వ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. అయితే ఈ సమావేశాలు జరిగిన తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని మంత్రి గుర్తు చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే సమావేశాలు 8వ సమావేశాలకు కొనసాగింపు మాత్రమేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ తరహలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. మరో వైపు పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కూడా గతంలో నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను ఉన్నత న్యాయస్తానం కొట్టివేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
వరి ధాన్యం కొనుగోలు, దళిత బంధు వంటి పథకాలపై బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయనుంది. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా హమీ ఇచ్చిన విషయం తెలిసిందే.