
హైదరాబాద్ : బీరు ప్రియులకు ఈ వేసవి మరింత చేదెక్కనుంది. చల్లటి beerతో వేసవిని తరిమి కొట్టాలనుకునేవారు.. సేదతీరాలనుకునేవారికి బీరు మరింత ప్రియంగా మారబోతోంది. బీరు బాటిల్ కు అదనంగా రూ.10 నుండి రూ.12 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నెలాఖరు నాటికి distilleries’ licencesల గడువు ముగియడంతో, ప్రతిపాదిత ధరల పెంపు ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ఈ ప్రతిపాదనలో ఈవెంట్ సైజ్ ఆధారంగా బీర్ ధర కూడా ఉంది. ప్రస్తుతం స్టాండర్డ్ బీర్ బాటిల్ ధర దాదాపు రూ.140గా ఉంది. దీనిని రూ.150 నుంచి రూ.152కి సవరించాలని భావిస్తున్నారు.
కొద్ది నెలల క్రితం New Liquor Policy అమల్లోకి వచ్చినప్పుడు అన్ని ఆల్కహాలిక్ పానీయాల ధరను 5% నుండి 10% వరకు పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పుడు ప్రణాళికను హోల్డ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీరు ధరలు పెరగనున్నాయి. ఒక్క బీరు ధరలో మాత్రమే ఇప్పుడు పెరుగుదల ఉండబోతోంది. అంతేకాదు తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున ఇక్కడ కూడా డిస్టిలరీలు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), శివారు ప్రాంతాలలో బీరు విక్రయాలమీద కొత్త ధరల విధానం, బీర్ వినియోగించే కార్యక్రమాల ఆధారంగా కూడా రేటు-కార్డును ఉంటుంది. “ప్రాథమికంగా, ఈవెంట్‌లు వాటి పరిమాణం ఆధారంగా వర్గీకరించబడతాయి. ధరలు తదనుగుణంగా నిర్ణయించబడతాయి. ఈ విధానం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్తించవచ్చు’’ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.
అయితే ధర పెరగకుండానే వేసవిలో బీర్ల విక్రయాల వల్ల అదనంగా 100 నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖ రూ. 31,196 కోట్లు ఆర్జించగా, 2020లో ఆ మొత్తం 25,602గా ఉంది. ఇందులో తయారీదారులు, అమ్మకందారుల వాటా 48% తీసేయగా.. మిగిలినది ఎక్సైజ్‌తో సహా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయంగా ఆర్జించబడుతుంది. రాష్ట్రంలో 2,630 వైన్ షాపులు ఉండగా, మరో 1,000 బార్లు, క్లబ్బులు, టూరిజం స్పాట్లలో మద్యం విక్రయిస్తున్నారు.
ఇదిలా ఉండగా, దేశీయ బ్రాండ్లతో పాటుగా దిగుమతి చేసుకున్న మద్యం బ్రాండ్‌లపై భారీ తగ్గింపు అందిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు ధరలకు వినియోగదారులకు మద్యం విక్రయిస్తున్నారు. అయితే ఇందంతా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ డిస్కౌంట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇందుకు అక్కడ అమల్లోకి వచ్చిన కొత్త మద్యం పాలసీనే కారణం. గతేడాది నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో.. బ్రాండెడ్ మద్యం MRPపై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపులు ఉంటున్నాయి. ఢిల్లీలోని మద్యం విక్రేతలు.. సరిహద్దు నగరాలైన నోయిడా, గురుగ్రామ్‌ల కంటే భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.