మిర్యాలగూడలో తాగుబోతుల హల్ చల్... కారుతో కానిస్టేబుల్ ను ఈడ్చుకెళ్ళి

Published : Apr 25, 2023, 02:03 PM IST
మిర్యాలగూడలో తాగుబోతుల హల్ చల్... కారుతో కానిస్టేబుల్ ను ఈడ్చుకెళ్ళి

సారాంశం

డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్ళి బీభత్సం సృష్టించారు తాగుబోతులు. ఈ ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. 

నల్గొండ : మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు మందుబాబులు. ఈ ప్రమాదాల నివారణ కోసం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. ఇలా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన పోలీసులపైకే కారు పోనిచ్చి ఓ తాగుబోతు బీభత్సం సృష్టించారు. కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు ఢీకొట్టి కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్ళారు.  

మిర్యాలగూడలో నిన్న(సోమవారం) రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక హనుమాన్ పేట ప్లైఓవర్ వద్ద వాహనాలను ఆపి ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తున్నారేమోనని బ్రీత్ అనలైజర్ తో టెస్టులు చేయసాగారు. ఈ క్రమంలో అటువైపు ఓ కారు రాగా ఆపేందుకు కానిస్టేబుల్ లింగారెడ్డి ప్రయత్నించాడు. కానీ కారును ఆపకుండా అడ్డువచ్చిన కానిస్టేబుల్ ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లారు. 

Read More  మంచిర్యాలలో దారుణం.. నడిరోడ్డులో యువకుడి గొంతుకోసి, బండరాయితో మోది హత్య...

ఊహించని ఘటనతో కానిస్టేబుల్ లింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా పోలీస్ సిబ్బంది కారును పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరక్కుండా పరారయ్యారు.  

కానిస్టేబుల్ లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన వారికోసం గాలిస్తున్నారు. సిసి కెమెరాల ఆదారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం సేవించి వుండటం వల్లే కారు ఆపకుండా వెళ్లిపోయివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?