పోలీసులపై దాడి: వైఎస్ షర్మిలకు షరతులతో బెయిల్ మంజూరు

By narsimha lode  |  First Published Apr 25, 2023, 1:10 PM IST

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు  నాంపల్లి  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది.  


హైదరాబాద్: వైఎస్ షర్మిలకు  నాంపల్లి కోర్టు  మంగళవారంనాడు బెయిల్ మంజూరు  చేసింది.  వైఎస్ షర్మిలకు  షరతులతో   నాంపల్లి కోర్టు  బెయిల్ మంజూరు  చేసింది.  రూ. 30వేలతో  ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు తెలిపింది.  విదేశాలకు  వెళ్లాలంటే  కోర్టు అనుమతి తీసుకోవాలని  కూడా  కోర్టు   ఆదేశించింది

పోలీసులపై దాడి  కేసులో  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్ షర్మిలను  పోలీసులు అరెస్ట్  చేశారు. నిన్న సాయంత్రం  నాంపల్లి కోర్టులో  పోలీసులు ఆమెను హాజరుపర్చారు. ఈ కేసులో  వైఎస్ షర్మిలకు ఈ ఏడాది మే 8వ తేదీ వరకు  జ్యుడీషీయల్ రిమాండ్  విధిస్తూ  నాంపల్లి  కోర్టు  ఆదేశాలు  జారీ చేసింది.  వైఎస్ షర్మిలకు కోర్టు రిమాండ్ విధించడంతో  షర్మిల తరపు న్యాయవాది  నిన్న రాత్రి  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.   ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుపుతామని  నాంపల్లి  కోర్టు తెలిపింది.  

Latest Videos

also read:వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి: నేటి మధ్యాహ్నం తీర్పు

ఇవాళ  ఉదయం  నాంపల్లి కోర్టులో  వైఎస్ షర్మిల తరపు న్యాయవాది,. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను  నాంపల్లి  కోర్టు విన్నది.  ఇవాళ  మధ్యాహ్నం ఒంటిగంటలకు   బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడిస్తామని  కోర్టు తెలిపింది.  మధ్యాహ్నం ఒంటిగంటకు  షర్మిలకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి  కోర్టు. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  సిట్  అధికారులను  కలిసేందుకు  వెళ్తున్న  వైఎస్ షర్మిలను  పోలీసులు నిన్న అడ్డుకున్నారు.  సిట్  కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని  వైఎస్ షర్మిలను  పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై  పోలీసులతో  వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు.   పోలీసులపై  దాడికి దిగారు.  ఈ విషయ మై  ఎస్ఐ రవీందర్  ఫిర్యాదు మేరకు  కేసు నమోదు  చేశారు.  కోర్టు  ఆదేశాల మేరకు  పూచీకత్తులు  ఇతర అంశాలను  సమర్పిస్తే  ఇవాళ  సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిల  విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇవాళ  ఉదయం చంచల్ గూడ జైలులో  వైఎస్ షర్మిలను  వైఎస్ విజయమ్మ  పరామర్శించారు.    నిన్న  పోలీసులు అత్యుత్సాహం  చూపించారని వైఎస్ విజయమ్మ విమర్శించారు. దేవుడి దయతో  షర్మిలకు  బెయిల్ వస్తుందని  ఆమె అభిప్రాయపడ్డారు. 

click me!