కీచకుడు : రోడ్డుపై వెడుతున్న యువతిని వివస్త్రను చేసి.. మందుబాబు అరాచకం..

Published : Aug 07, 2023, 09:27 AM ISTUpdated : Aug 07, 2023, 09:30 AM IST
కీచకుడు : రోడ్డుపై వెడుతున్న యువతిని వివస్త్రను చేసి.. మందుబాబు అరాచకం..

సారాంశం

రోడ్డుపై నడిచివెడుతున్న యువతిని వివస్త్రను చేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిచి వెడుతున్న ఓ యువతి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. బాలాజీ నగర్ బస్టాండ్ దగ్గర ఓ యువతి (26) నడుచుకుంటూ వెడుతోంది. ఆ యువతిని చూసిన పెద్దమారయ్య (30) ఆమె వెంటపడి నడిరోడ్డులో వివస్త్రను చేశాడు.

పదినిమిషాల పాటు ఈ దారుణం జరుగుతున్నా ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఆమెను వివస్త్రను చేసిన తరువాత ఆ కీచకుడు మరో మహిళ మీద దాడికి ప్రయత్నించినట్టు సమాచారం. అతను అక్కడినుంచి వెళ్లాక.. బాధితురాలికి కవర్లు కప్పి కాపాడారు. పోలీసులకు సమాచారం తెలియడంతో అతడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.  మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం