హైదరాబాద్ లో దారుణం... కన్న కూతురిపైనే కామాంధుడి అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Oct 26, 2021, 11:45 AM IST
హైదరాబాద్ లో దారుణం... కన్న కూతురిపైనే కామాంధుడి అత్యాచారయత్నం

సారాంశం

మానవసంబంధాలకు మచ్చల ా నిలిచే సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే ఓ కామాంధుడైన తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడి కటకటాలపాలయ్యాడు.

హైదరాబాద్: కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అమానుషం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో వావివరసలు మరిచిన తండ్రి సభ్యసమాజం తలదించుకునేలా కూతురితో వ్యవహరించాడు. మద్యం మత్తులో అచ్చోసిన అంబోతులా వ్యవహరిస్తూ అభం శుభం తెలియని పదకొండేళ్ల కూతురిపై అఘాయిత్యానికి యత్నించగా తల్లి కాపాడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. Hyderabad లోని దూల్ పేట గండి హనుమాన్ నగర్ కాలనీలో నర్సింగ్(30) అనే కార్మికుడు కుటుంబంతో కలిసి నివాసమముంటున్నాడు. అతడు రోజూ పని ముగించుకుని మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఇలాగే గత ఆదివారం కూడా ఫూటుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. 

నర్సింగ్ ఇంటికి చేరుకునే సరికి భార్యతో పాటు పదకొండేళ్ళ కూతురు నిద్రిస్తూ వుంది. అయితే మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నర్సింగ్ కన్న కూతురితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి వికృత చేష్టలతో బాలికకు మెలకువ వచ్చినా వదిలిపెట్టకుండా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గట్టిగా అరవడంతో తల్లి నిద్రలేచింది. దీంతో ఈ కామాంధుడు ఇంట్లోంచి పరారయ్యాడు. 

read more  మహబూబ్ నగర్: ఒకే గదిలో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం... నిండు గర్భిణి మృతి

తనతో తండ్రి ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో బాలిక తల్లికి తెలిపింది. దీంతో ఆ తల్లి కట్టుకున్నవాడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నీచుడు నర్సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

తమ కుటుంబం పరువు పోతుంది... భర్త జైలుకెలతాడు అని భయపడకుండా తన కూతురిని వేధించిన కట్టుకున్నవాడిని జైలుకు పంపిన ఆ తల్లిని తెగువ ప్రశంసనీయం. తన కూతురి జోలికి వస్తే ఎవడినైనా చివరకు కట్టుకున్నవాడిని కూడా వదిలిపెట్టనని ఆ తల్లి నిరూపించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ