తండ్రి కుర్చీకే ఎసరు పెడుతున్న కేటీఆర్.. భవిష్యత్తులో ఏపీలో లోకేష్ కూడా.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

By AN TeluguFirst Published Oct 26, 2021, 11:43 AM IST
Highlights

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతి అని పేర్కొన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యారని తెలిపారు. 


హైదరాబాద్ : టీఆర్ఎస్ 20యేళ్ల ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను ఉద్దేశించి బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Plenary చిత్రాల్లో ఎక్కడా కేటీఆర్ ఫోటో కనబడకపోవడం వెనుక పెద్ద కథే ఉందన్నారు. తన facebook ఖాతాలో ‘ఆపరేషన్ హైద్రావతి’ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతి అని పేర్కొన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యారని తెలిపారు. 

టీఆర్ఎస్ ను బలోపేతం చేసే పేరుతో KTR తమిళనాడు వెళ్లి డీఎంకే పనితీరును పరిశీలిస్తామని చెప్పడం కూడా ఆ Operation Hydravatiలో భాగమేనన్నారు. TRSను బలోపేతం చేసే పేరుతో కేటీఆర్ తమిళనాడు వెళ్లి డీఎంకే పనితీరును పరిశీలిస్తామని చెప్పడం కూడా ఆ ఆపరేషన్ లో భాగమేనన్నారు. 

టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది వలసదారులేనని ఆ వీడియోలో పేర్కొన్నారు. కేటీఆర్ తన ఎమ్మెల్యేలను స్టాలిన్ వద్దకు తీసుకెళ్లి మనందరికీ ఆయన ఉన్నారనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. 

ఏపీలో లోకేష్, తెలంగాణలో కేటీఆర్, భవిష్యత్ నేతలు అయ్యేలా పథక రచన చేసినట్లు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి  ఎన్నిక Huzurabad లోనేనన్నారు. దీని తర్వాత టీఆర్ఎస్ ను కేటీఆర్ విచ్చిన్నం చేయబోతున్నారని MP Arvind జోస్యం చెప్పారు. 

ఇప్పటికే కేటీఆర్‌ తానే సీఎం అని మంత్రులు, కీలకనేతలతో ప్రచారం చేయించుకున్నారని తెలిపారు. అయితే, కేసీఆర్ సదరు ప్రచారాన్ని ఖండించారని గుర్తు చేశారు. కేటీఆర్ మాత్రం గజనీ మహ్మద్ లా తండ్రి కుర్చీని లాగే ప్రయత్నం కొనసాగిస్తున్నారన్నారు. 

అయితే, కేసీఆర్ మాత్రం తన జాగ్రత్తలో తానున్నట్లు పేర్కొన్నారు. అందుకే ప్లీనరీ ప్రచార పోస్టర్లలో కేటీఆర్ ఫొటో లేకుండా చూసుకున్నారన్నారు. కాగా, ప్లీనరీ సందర్భంగా నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్‌ ఫోటోలు ఉండడం గమనార్హం. 

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ భయం.. వరుసగా గొర్రెల మృత్యువాత, స్థానికుల్లో ఆందోళన

ఇదిలా ఉంటే.. హుజురాబాద్ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు ఇల్లందకుంట దళితవాడలో కొద్దిసేపు ఆగి కాలనీ వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత బందుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... ఈ పథకాన్ని గ్రౌండ్ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని హరీష్ సవాల్ విసిరారు. 

''dalit bandhu ను ప్రతి ఇంటికి ఇస్తాం. కావాలనే ఈ పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసాయి... అపోహలు కల్పించాయి. వీటిని ఎవరు నమ్మవద్దు. దళిత బంధు ను గ్రౌండ్ చేయకపోతే నా పేరే మార్చుకుంటాను'' అని harish rao స్పష్టం చేసారు.

''దళితబంధు పథకం చరిత్రలోనే కనీవినీ ఎరుగని గొప్ప పథకం. దళితులూ అడగకుండానే ఈ పథకాన్ని సిఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సిఎం సంకల్పం. KCR కు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం దళిత బంధు'' అన్నారు. 

''గత ప్రభుత్వాల హయాంలో ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా దళితులకు రుణాలు ఇవ్వలేదు. uttar pradesh ముఖ్యమంత్రిగా పనిచేసిన Mayavathi కూడా ఇలాంటి పథకం అమలు చేయలేకపోయారు. కానీ కేసీఆర్ ధైర్యం చేసి ఈ గొప్ప పథకాన్ని ప్రారంభించారు'' అని పేర్కొన్నారు. 

click me!