హైద్రాబాద్‌లో మెడికల్ దుకాణాలపై డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు: పలు షాపుల లైసెన్సుల రద్దు

By narsimha lode  |  First Published Jun 8, 2023, 10:20 AM IST

హైద్రాబాద్ నగరంలో  మెడికల్ దుకాణాలపై  డ్రగ్స్ అధికారులు  దాడులు నిర్వహించారు.  పలు మెడికల్ షాపుల  లైసెన్సులను  అధికారులు  రద్దు  చేశారు. 


హైదరాబాద్: నగరంలోని మెడికల్ దుకాణాలపై  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు  దాడులు  నిర్వహిస్తున్నారు. గత మూడు  రోజులుగా  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు  తనిఖీలు  చేస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో   నాసిరకం  మందుల విక్రయంతో పాటు  అధిక ధరలకు  మందులు విక్రయించే వారిపై  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు  చర్యలు తీసుకున్నారు.

అనమతులు లేకుండా  మందులు విక్రయిస్తున్న దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు. హైద్రాబాద్ నగరంలోని  పలు  మెడికల్ షాపులపై   అధికారులు  దాడులు  నిర్వహించారు.  కొన్ని  మెడికల్ దుకాణాల లైసెన్స్ లను రద్దు  చేశారు డ్రగ్స్ కంట్రోల్  అధికారులు.

Latest Videos

.కోఠిలోని  ఇందర్ బాగ్ లోని  మెడికల్ షాపుల లైసెన్సు ను అధికారులు శాశ్వతంగా  రద్దు  చేశారు.  .మెడికల్ షాపుల్లో   అక్రమంగా మందుల విక్రయిస్తున్న విషయం గుర్తించారు అధికారులు..అంబర్ పేటలోని  బయోస్పియర్ ఎంటర్ ప్రైజెస్   లైసెన్స్ ను రద్దు  చేశారు.  చార్మినార్ లోని భారత్  మెడికల్ దుకాణంలో  విక్రయాలను  సస్పెండ్  చేశారు. అక్షయ మెడికల్  లైసెన్స్ రద్దు  చేశారు.  లంగర్ హౌస్  ఆర్ఎస్ మెడికల్  షాపు లైసెన్స్ రద్దు  చేశారు.ఉప్పల్ లోని  శ్రీఅయ్యప్ప మెడికల్, గౌలిగూడ  గోకుల్ మెడికల్ షాపులో  నిషేధిత  మందులు విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

హైద్రాబాద్ లో  గంజాయి, డ్రగ్స్ పై  పోలీసులు  నిఘాను తీవ్రతరం చేశారు. దీంతో డ్రగ్స్  ఇతర  మత్తు పదార్ధాలకు అలవాటుపడిన వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు  కేంద్రీకరించారు. మెడికల్ షాపుల్లో  లభించే  కొన్ని మందులను   ఇందుకు  వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో  కొన్ని మెడికల్ షాపుల్లో  కొన్ని రకాల మందుల విక్రయాలు  విపరీతంగా  పెరిగాయి. ఈ విషయమై  డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అనుమానం వచ్చింది. .  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, సోదాలు  నిర్వహించారు. 


 

click me!